వీడియో : ప్రగ్యా వర్కౌట్స్ చూస్తే షాక్‌ అవుతారు

మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించిన 'కంచె' సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న ప్రగ్యా జైస్వాల్‌ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.;

Update: 2025-05-27 08:11 GMT

హీరోయిన్స్‌ తమ ఫిజిక్‌ను స్లిమ్‌గా, అందంగా కనిపించడం కోసం రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎంతో మంది హీరోయిన్స్ జిమ్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. పలువురు ముద్దుగుమ్మలు జిమ్‌లో వర్కౌట్స్ చేసిన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటారు. గతంలో పలు సార్లు ప్రగ్యా జైస్వాల్‌ సైతం తన వర్కౌట్‌ ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. అయితే ఈసారి స్పెషల్‌గా జిమ్‌లో కాకుండా ఆరు బయట డాన్స్ మూమెంట్స్ చేసినట్లు వర్కౌట్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. ట్రైనర్‌తో కలిసి ప్రగ్యా జైస్వాల్‌ చేసిన ఈ విభిన్నమైన వర్కౌట్‌ వీడియను చాలా మంది లైక్ చేస్తున్నారు.

ప్రగ్యా షేర్ చేసిన వీడియోను కొన్ని గంటల్లోనే వేలాది మంది లైక్‌ చేశారు. తక్కువ సమయంలోనే అత్యధికులు ఈ వీడియోను చూడటం మాత్రమే కాకుండా లైక్ చేశారు. ఆకట్టుకునే విధంగా ఉన్న ఈ వీడియోను చాలా మంది ముందు ముందు ఫాలో అవుతారని కూడా కొందరు కామెంట్‌ చేస్తున్నారు. బరువు తగ్గడానికి, కాళ్లు, చేతులు దృఢంగా మారడంకు ఇలాంటి వర్కౌట్స్ చాలా సహాయ పడుతాయని కూడా కొందరు మాట్లాడుతున్నారు. మొత్తానికి ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి ఈ వర్కౌట్‌ వీడియోతో వార్తల్లో నిలిచింది. ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌ అందానికి ఇలాంటి కష్టమైన వర్కౌట్స్ ఒక కారణం అయ్యి ఉంటాయని చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు.

మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించిన 'కంచె' సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న ప్రగ్యా జైస్వాల్‌ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇండస్ట్రీలో ఈ అమ్మడికి దక్కిన గుర్తింపుతో ఆఫర్లు మాత్రం రావడం లేదు. కొన్ని సీనియర్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలో నటించే అవకాశం దక్కినా స్టార్‌డం మాత్రం రావడం లేదు. వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకోవడంలో విఫలం అవుతుంది. ముందు ముందు ఈ అమ్మడు ఇండస్ట్రీలో రాణించడం కోసం ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో పాటు టైసన్ నాయుడు సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలతో అయినా ప్రగ్యా జైస్వాల్‌ రాణిస్తుందా అనేది చూడాలి.

1991లో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించిన ప్రగ్యా జైస్వాల్‌ పూణేలోని సింబియోసిస్ లా స్కూల్‌లో విద్యను పూర్తి చేసింది. సింబియోసిస్‌ విశ్వ విద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్‌పై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసింది. 2014లో సింబియోసిస్‌ కార్యక్రమంలో పుస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత గుర్తింపు దక్కించుకుంది. కానీ స్టార్‌డం దక్కించుకోవడంలో మాత్రం ఈ అమ్మడు విఫలం అయింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అయినా ఇప్పటికీ ఆఫర్ల కోసం ఈ అమ్మడు చూసుకోవాల్సి వచ్చింది. ప్రగ్యా జైస్వాల్‌ అందం విషయంలో చాలా మంది హీరోయిన్స్ కంటే ముందు ఉంటుంది. కానీ లక్ కలిసి రాకపోవడంతో సినిమాల్లో ఆఫర్లు ఎక్కువ దక్కించుకోవడం లేదు.

Tags:    

Similar News