స్పిరిట్ లీక్.. సందీప్ వంగ హ్యాపీ..?

యానిమల్ తర్వాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ చేస్తున్న ఈ మూవీపై రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.;

Update: 2025-12-02 08:37 GMT

యానిమల్ తర్వాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా స్పిరిట్. రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ చేస్తున్న ఈ మూవీపై రెబల్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. సినిమా గురించి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సౌండ్ స్టోరీ రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఐతే ప్రభాస్ స్పిరిట్ సినిమా హైదరాబాద్ లో జరుగుతుంది. కోటి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది.

సెట్ లో ప్రభాస్, సందీప్ వంగ మాట్లాడుతున్న వీడియో..

సెట్ లో ప్రభాస్, సందీప్ వంగ మాట్లాడుతున్న వీడియో బయటకు వచ్చింది. ఆ లీకైన వీడియోలో ప్రభాస్ పోలీస్ డ్రెస్ లో ఉన్నాడు. ఇది చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఐతే స్పిరిట్ షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. మరి షూటింగ్ నుంచి లీక్స్ జరగకుండా చేయాల్సిన బాధ్యత డైరెక్టర్ మీద ఉంటుంది. ఐతే సందీప్ వంగ మాత్రం స్పిరిట్ వీడియో లీక్ పై అంత సీరియస్ గా లేరని టాక్.

లీక్ అయితే అయ్యింది అందులో మ్యాటర్ ఏముంది అన్నట్టుగా చెప్పాడట. ఓ విధంగా స్పిరిట్ గురించి ఈ లీకైన వీడియో ద్వారా సోషల్ మీడియాలో ఇంకాస్త డిస్కషన్ జరుగుతుందని భావిస్తున్నారట సందీప్ వంగ. స్టార్ సినిమాకు ఇలాంటి లీక్స్ కాస్త ఎఫెక్ట్ చూపిస్తాయి. ఐతే అది సందీప్ వంగ సినిమా కాబట్టి ఆ లీక్ అయిన వీడియో వల్ల ఏమంత ఇంపాక్ట్ ఉండదని అంటున్నారు.

ప్రభాస్ స్పిరిట్ 2027 లో రిలీజ్..

స్పిరిట్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ అసలు సిసలు యాక్షన్ చూపిస్తా అంటున్నాడు సందీప్ వంగ. ప్రకాష్ రాజ్ తో పాటు సౌత్ కొరియన్ డాన్ లీ ని కూడా తీసుకొస్తాడన్న చర్చ జరుగుతుంది. సినిమాలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రభాస్ స్పిరిట్ సినిమాను 2027 లో రిలీజ్ చేసేలా సందీప్ వంగ ప్రయత్నిస్తున్నారు.

ప్రభాస్ స్పిరిట్ తో పాటు హనుతో ఫౌజీ కూడా చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్ లో చేసిన రాజా సాబ్ 2026 సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే ఫౌజీ కూడా రిలీజ్ చేసే ప్లాన్ ఉందని తెలుస్తుంది. స్పిరిట్ సినిమాను సందీప్ వంగ తన మార్క్ యాక్షన్ మూవీగా ఒక డిఫరెంట్ సెటప్ లో ప్లాన్ చేస్తున్నారు. ఐతే సెట్స్ మీదకు వెళ్లిన వెంటనే స్పిరిట్ వీడియో లీక్ పై ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ లీక్స్ సినిమాపై ఉన్న బజ్ ని తగ్గించేలా చేస్తాయి. అందుకే ఈ లీక్ తో మేకర్స్ షూటింగ్ స్పాట్ ని మరింత కట్టుదిట్టం చేయనున్నారు.

Tags:    

Similar News