అభిమానుల కోసం జపాన్ కు డార్లింగ్!
మన హీరోలు ఏ దేశం వెళ్తే ఆదేశానికి జపాన్ నుంచి వచ్చేస్తున్నారంటే? అభిమానం ఏ స్థాయికి చేరిందన్నది అద్దం పడుతుంది.;
తెలుగు హీరోల అభిమానం హద్దులు ఎప్పుడో దాటి పోయింది. తెలుగు అభిమానుల్లా విదేశీ అభిమానులు కూడా టాలీవుడ్ స్టార్స్ ని ఆరాధించడం కళ్లముందు కనిపిస్తూనే ఉంది. తెలుగు హీరోలు చైనా, జపాన్, అమెరికా లాంటి దేశాలు వెళ్లినప్పుడు అక్కడ అభిమానులు ఏ స్థాయిలో అభిమానం కురిపిస్తున్నారో? చూసాం. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ అంటే విదేశాల్లో పిచ్చ క్రేజ్ ఉంది. ప్రత్యేకించి జపాన్ అభిమానం ఎంతో ప్రత్యేకమైనది. మన హీరోలు ఏ దేశం వెళ్తే ఆదేశానికి జపాన్ నుంచి వచ్చేస్తున్నారంటే? అభిమానం ఏ స్థాయికి చేరిందన్నది అద్దం పడుతుంది. హీరోలు సైతం విదేశీ అభిమానులంటే అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వాళ్లను గుర్తించి మాట్లాడటం..సెల్పీలు ఇవ్వడం వంటివి వాళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ ప్రత్యేకంగా అభిమానుల్ని పలకరించడం కోసమే జపాన్ వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆయన హీరోగా నటించిన `కల్కి 2898` జపాన్ లో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రచారం సమయంలో డార్లింగ్ జపాన్ వెళ్లలేదు. ఇండియాలో బిజీగా ఉండటంతో ఆ సినిమా కోసం జపాన్ వెళ్లలేదు. కానీ రిలీజ్ అనంతరం ఆ సినిమాను మాత్రం జపాన్ అభిమానులు గ్రాండ్ సక్సెస్ చేసారు.
ఈ నేపథ్యంలో వారికి కృతజ్ఞతలు చెప్పేందుకు డిసెంబర్ లో జపాన్ వెళ్లనున్నారు. ప్రస్తుతం `పౌజీ` షూటింగ్ లో డార్లింగ్ బిజీగా ఉన్నాడు. కానీ ఈ సినిమా నుంచి బ్రేక్ తీసుకుని మరీ జపాన్ వెళ్లాలనుకుంటున్నారు. కీలక షెడ్యూల్స్ ఉన్నా? వాటిని పక్కన బెట్టి జపాన్ వెళ్తున్నారని తెలిసింది. జపాన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత `స్పిరిట్` సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నారుట. `పౌజీ` షూటింగ్ ఉన్నా? దాంతో సంబంధం లేకుండా పట్టాలెక్కిద్దామని సందీప్ రెడ్డికి చెప్పినట్లు తెలిసింది. అలాగే `రాజాసాబ్` ప్రచార కార్యక్రమాల్లో కూడా డార్లింగ్ పాల్గొంటారు.
ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి ఒక్క ఈవెంట్ మినహా ఎలాంటి ప్రచారం చేయలేదు. భారీ అంచనాలున్న నేపథ్యంలో? ప్రచారం కూడా కీలకం కావడంతో? షూటింగ్ తో పాటు, `రాజాసాబ్` ముఖ్యమైన ప్రచార కార్యక్రమాల్లో కూడా డార్లింగ్ పాల్గొంటారు. ప్రస్తుతం దర్శకుడు మారుతి సినిమాకు సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నాడు. చిత్రీకరణ పూర్తయిన నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారు.