OG కాపీ అంటూ మరో ట్రోలింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ OG.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ప్యాక్డ్ మూవీ OG. మాఫియా బ్యాక్ డ్రాప్ కథాశంతో ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సిద్ధమవుతోన్న మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా OG టీజర్ ని రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ కెరియర్ బెస్ట్ టీజర్ గా ఇది ఉందనే ప్రశంసలు లభిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ని సుజిత్ ఆవిష్కరించిన విధానం అద్భుతంగా ఉందని, అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ కూడా మూవీ ఇంటెన్షన్ ని పెర్ఫెక్ట్ గా రిప్రజెంట్ చేస్తోందని ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ నుంచి కూడా వస్తోన్న అభిప్రాయం. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తోన్న సంగతి తెలిసిందే.
టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. పవన్ అభిమానులు అయితే ఈ మ్యూజిక్ ని బాగానే ఆశ్వాదిస్తున్నారు. అయితే మొదటి నుంచి థమన్ పై కాపీక్యాట్ విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక సినిమా నుంచి ట్యూన్స్ లేపేసి థమన్ తన సినిమాల కోసం వాడేసుకుంటాడని విమర్శిస్తూ ఉంటారు.
కొంతమంది అయితే ఒరిజినల్ సాంగ్స్ కి తమన్ సాంగ్స్ లేదా బ్యాగ్రౌండ్ స్కోర్ జోడించి కాపీ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్ చేస్తుంటారు. ఎన్ని చేసిన దర్శకులు,హీరోలు మాత్రం అతని టాలెంట్ ని బిలీవ్ చేస్తారు. అవకాశాలు మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ చివరిగా చేసిన మూడు సినిమాలకి థమన్ మ్యూజిక్ అందించారు. ఇప్పుడు OG సినిమాకి కూడా.
అయితే టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని ఓ హాలీవుడ్ సినిమా నుంచి థమన్ కాపీ చేశాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. సదరు సినిమాని కూడా రిఫర్ చేస్తూ థమన్ మరోసారి తన అలవాటుని OG మూవీ విషయంలో కూడా రిపీట్ చేశాడంటూ విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై అతనేమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.