సింగపూర్ ట్రాజెడీ తర్వాత పవన్ వారసుడు ఇలా
తాజాగా అంతర్జాలంలో వైరల్ అవుతున్న వీడియోలో మార్క్ తన కుటుంబంతో విమానాశ్రయంలో నడుస్తూ కనిపించాడు.;
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్(8) సింగపూర్ లో అగ్నిప్రమాదంలో చిక్కుకుని గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే. బాలుడు అధికంగా పొగను పీల్చడంతో ఆస్పత్రిలో బ్రాంకోస్కోపీ చికిత్స చేయాల్సి వచ్చింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే తండ్రి పవన్ కల్యాణ్ తన అన్నా వదినా చిరంజీవి- సురేఖలతో కలిసి సింగపూర్ కి హుటాహుటీన బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. సింగపూర్ నుంచి తిరిగి మార్క్ శంకర్, అన్నా లెజినోవాతో కలిసి పవన్ హైదరాబాద్ కి వచ్చేసారు. ఆ తర్వాత ఇప్పటివరకూ చిన్నారి మార్క్ శంకర్ ఎలా ఉన్నాడో ఊహాగానాలు మాత్రమే .. పబ్లిగ్గా చూసింది లేదు.
అయితే అభిమానుల్లో సందేహాలన్నీ మటుమాయం చేస్తూ, ఇప్పుడు మార్క్ శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. అతడు తన తల్లి దండ్రులు అన్నా లెజినోవా- పవన్ కల్యాణ్ తో పాటు బహిరంగంగా కనిపించాడు. తాజాగా అంతర్జాలంలో వైరల్ అవుతున్న వీడియోలో మార్క్ తన కుటుంబంతో విమానాశ్రయంలో నడుస్తూ కనిపించాడు. పవన్ కళ్యాణ్ ఒకవైపు అన్నా, మరోవైపు మార్క్ తో వేగంగా నడుస్తున్నారు. ఎనిమిదేళ్ల ఆ చిన్న పిల్లవాడు భుజంపై బ్యాగ్ మోసుకెళుతూ.. చేతిలో నోట్‌బుక్ పట్టుకుని ఎంతో ఉత్సాహంగా కనిపించాడు.
మార్క్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. గాయాలు నయమయ్యాయ. ఆ ఉత్సాహం అతడిలో కనిపిస్తోంది. ఇది నిజంగా అభిమానులకు సంతోషకరమైన వార్త. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను ఎగ్జయిట్ చేస్తోంది. తమ అభిమాన కథానాయకుడి కుమారుడు ఆరోగ్యంగా ఉండటంతో ఫ్యాన్స్ ఆనందంగా సోషల్ మీడియాల్లో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.
పవన్ నటించిన `హరిహర వీరమల్లు` జూన్ మొదటి వారంలో విడుదల కానుంది. ఆ తర్వాత ఓజీ సెప్టెంబర్ లో విడుదలవుతుంది. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరమల్లులో వారియర్ గా నటిస్తున్న పవన్, ఓజీలో గ్యాంగ్ స్టర్ పాత్రలో అలరించనున్నారు.