OG లో స్పెషల్ సాంగ్.. కన్ఫర్మ్ చేసిన నేహా శెట్టి.. కీలక సన్నివేశాల్లో కూడా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న తాజా మూవీ ఓజీ.. దసరా కానుకగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతోంది.;

Update: 2025-09-14 09:20 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న తాజా మూవీ ఓజీ.. దసరా కానుకగా ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాని చూడడానికి ఇప్పటికే ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఓజీ మూవీ నుండి కొన్ని సాంగ్స్ తో పాటు ఎన్నో అప్డేట్లు కూడా ఇస్తున్నారు. అయితే గత కొద్దిరోజుల నుండి మూవీకి హైప్ తగ్గుకుంటూ వస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే సినిమాకి భారీ హైప్ ఇచ్చింది డిజె టిల్లు బ్యూటీ నేహా శెట్టి.. త్వరలోనే ఓజీ మూవీతో మీ ముందుకు రాబోతున్నాను అంటూ నేహా శెట్టి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులకి కిక్కిస్తున్నాయి. మరి ఇంతకీ ఓజీ మూవీ లో నేహా శెట్టి పోషించబోయే పాత్ర ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

సుజీత్ డైరెక్షన్లో డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న తాజా మూవీ ఓజీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది హీరోయిన్ నేహ శెట్టి.ఆమె తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ లో మాట్లాడుతూ.. "త్వరలోనే నా కొత్త సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్లు ఇస్తాను.కానీ అన్నింటి కంటే ముందు ఓజీ మూవీతో మీ ముందుకు రాబోతున్నాను. ఓజీ మూవీలో సర్ప్రైజింగ్ రోల్ లో కనిపిస్తాను. పవన్ కళ్యాణ్ తో నాకు మంచి సన్నివేశాలు ఉన్నాయి" అంటూ చెప్పుకొచ్చింది.

అయితే గత కొద్ది రోజులుగా నేహ శెట్టి ఓజీ మూవీలో ఐటెం సాంగ్ చేస్తుందనే రూమర్లు వినిపించినప్పటికీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు నేహశెట్టి స్వయంగా నేను ఓజీ సినిమాలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను అని చెప్పడంతో నేహా శెట్టి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టు అందరికీ అర్థమైంది. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత నుండి పవన్ కళ్యాణ్ నటించిన ఏ సినిమాలో కూడా ఐటెం సాంగ్స్ లేవు.

కానీ ఓజీ మూవీలో ఐటెం సాంగ్ ఉండబోతున్నట్టు రూమర్స్ వినిపించడంతోపాటు నేహ శెట్టి చెప్పిన మాటలు పవన్ ఫ్యాన్స్ కి మరింత కిక్కిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన సువ్వి సువ్వి, ఫైర్ స్మార్ట్, హాంగ్రీ చీతా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ ని అలరించాయి.

Tags:    

Similar News