సనాతన ధర్మ పరిరక్షణకై నడుం బిగించిన హరిహర వీరమల్లు

అలాంటి వారందరి ముచ్చట తీరుస్తూ హరిహర వీరమల్లుగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిష్ - జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి పలకరించింది.;

Update: 2025-07-27 04:59 GMT

పవన్ కళ్యాణ్ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్, ఒక పవర్ స్టేషన్ లాంటి ఇమేజ్ ఆయనది. టాక్‌తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ చేసే సినిమాలు మార్క్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌ కంటూ ఒక ఇమేజ్ ఉంది, ఆయనకంటూ ప్రత్యేకమైన స్టైల్, ఒక మార్కెట్, ఊహించని ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన సినిమాలలో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నా, లేకపోయినా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆయన సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

అలాంటి వారందరి ముచ్చట తీరుస్తూ హరిహర వీరమల్లుగా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిష్ - జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి పలకరించింది.

అయితే నిజానికి ఈ సినిమా ముందు అనుకున్నప్పుడు కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తీసుకువస్తే అనే లైన్‌తోనే అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో సనాతన ధర్మం గురించి ఎక్కువ ప్రస్తావించారు.

నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో సనాతన ధర్మం గురించి ఇప్పటి జనరేషన్ కిడ్స్‌కి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఎందుకంటే పాశ్చాత్య పోకడలకు అలవాటు పడి, ఒక మోస ధోరణిలో సాగిపోతున్న వారికి పవన్ కళ్యాణ్ లాంటి వారు చొరవ తీసుకొని ఇలాంటి సినిమాలు చేసి చెప్పకపోతే, భవిష్యత్తు తరాలే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ చేసిన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమాగా నిలిచింది. ముఖ్యంగా హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ నటన అసమానం.

Tags:    

Similar News