వేదికలు మారాయి.. స్పీచ్ మారలేదు..!

ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు కాబట్టి తప్పకుండా దానికి తగిన ఫలితం ఉంటుందని చెప్పొచ్చు.;

Update: 2025-07-23 19:34 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా వరుస ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో ఉదయం ప్రెస్ మీట్ ఈవెంట్ ఈవెంట్, ఇక అక్కడ సరిపోలేదు అనుకుని అళ్లీ వైజాగ్ లో కూడా రిలీజ్ కు కొద్ది గంటల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు పవర్ స్టార్. వైజాగ్ తనకు ఎంత స్పెషల్ అన్నది చెబుతూ వైజాగ్ వీరమల్లు ఈవెంట్ లో పవర్ స్టార్ స్పీచ్ అదిరిపోయింది. ముఖ్యంగా తనకు నటనా శిక్షణ ఇచ్చిన వైజాగ్ సత్యానంద్ ని ఇన్వైట్ చేసి సత్కరించారు.

ఐతే వరుస గా వీరమల్లు ఈవెంట్స్ లో పాల్గొనడం వల్లో ఏమో కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ లో రిపీటెడ్ డైలాగ్స్ వినిపించాయి. ముందు ఈవెంట్స్ లో చెప్పిందే చెబుతూ వచ్చారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్, ప్రొడ్యూసర్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఈవెనింగ్ శిల్పకళా వేదికలో జరిగిన ఈవెంట్ లో కూడా అదే రిపీట్ చేశారు. నిధి అగర్వాల్ గురించి కూడా ఒకటే మాట నెల రోజుల నుంచి ప్రమోషన్స్ భుజాన వేసుకుంది. ఆమెను చూసి సిగ్గు పడి తాను ప్రమోషన్స్ చేస్తున్నా..

ఇక టికెట్ రేట్లు విషయం ప్రస్తావిస్తూ భీంలా నాయక్ టైం లో తన సినిమాకు 10, 15 రూపాయలు ఇచ్చింది గత ప్రభుత్వం. అయినా అది సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం అంటూ టికెట్ రేట్ల ప్రస్తావన కూడా దాదాపు 3 వేదికల్లో ప్రస్తావించారు. ఇలా పవర్ స్టార్ చాలా రోజుల తర్వాత సినిమా ఈవెంట్స్ లో రెండు రోజుల్లో 3 ఈవెంట్స్ లో పాల్గొన్నందుకు ఫ్యాన్స్ కి సంతోషంగా ఉన్నా ఆయన స్పీచ్ లో చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పాడన్న భావన అయితే ఉంది.

ఐతే ఇవన్నీ పక్కన పెడితే పవర్ స్టార్ మాస్ స్టామినా ఏంటో చూపించేలా వీరమల్లు కలెక్షన్స్ ఉంటాయనిపిస్తుంది. ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు కాబట్టి తప్పకుండా దానికి తగిన ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. హరి హర వీరమల్లు సినిమాతో పవర్ స్టార్ తొలిసారి పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News