పవన్ కళ్యాణ్ దారి చూపించాడుగా..?
మామూలుగానే పవర్ స్టార్ అంటే ట్రెండ్ ఫాలో అవ్వడు సృష్టిస్తాడని అంటారు. అలానే స్టార్ సినిమాలకు సింగిల్ హ్యాండ్ ప్రమోషన్ తో కొత్త ప్రమోషనల్ పంథాకి శ్రీకారం చుట్టాడు పవన్ కళ్యాణ్.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లుకి చేసిన ప్రమోషన్స్ చాలామంది స్టార్స్ కి షాక్ ఇచ్చింది. ఆయన జస్ట్ పార్ట్ టైం గా సినిమాలు చేస్తూనే ఇంతగా ఒక సినిమా కోసం కేటాయించి ప్రమోట్ చేయడంపై అందరు సర్ ప్రైజ్ అవుతున్నారు. మామూలుగానే పవర్ స్టార్ అంటే ట్రెండ్ ఫాలో అవ్వడు సృష్టిస్తాడని అంటారు. అలానే స్టార్ సినిమాలకు సింగిల్ హ్యాండ్ ప్రమోషన్ తో కొత్త ప్రమోషనల్ పంథాకి శ్రీకారం చుట్టాడు పవన్ కళ్యాణ్.
హీరో ఇలా సింగిల్ హ్యాండిల్ గా సినిమాను ప్రమోట్ చేస్తే ఇదే విధంగా మిగతా స్టార్స్ కూడా చేసేలా నిర్మాతల నుంచి ఒత్తిడి రాక తప్పదు. ముఖ్యంగా సినిమాకు ఎవరెంత ప్రమోషన్ చేసినా కూడా హీరో చేయడం మీదే ఆ సినిమా బజ్ ఆధారపడి ఉంటుంది. పవర్ స్టార్ ఇన్నేళ్ల కెరీర్ లో ఎప్పుడు ఇలా పని కట్టుకుని ఒక సినిమాను ప్రమోట్ చేయలేదు. ఐతే నాలుగేళ్లుగా సినిమా సెట్స్ మీద ఉంది. సినిమాను కాస్త పుష్ ఇస్తే బాగుంటుందని అలా పవన్ సపోర్ట్ చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూపించిన ఈ ప్రమోషనల్ దారి మిగతా స్టార్స్ కూడా ఫాలో అయితే మాత్రం కచ్చితంగా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. అంతేకాదు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్ లకు అలవాటు పడి ఈ ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ కూడా అదే తరహాలో భావిస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ వీరమల్లు రిలీజ్ ముందు హైదరాబాద్ లో రెండు ఈవెంట్స్, వైజాగ్ లో ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు.
ఇక మీదట పవన్ కళ్యాణ్ తన ప్రతి సినిమాకు ఇలానే ప్రమోట్ చేస్తాడా అంటే ఏమో తెలియదు కానీ హరి హర వీరమల్లు కోసం పవర్ స్టార్ చేసిన ప్రమోషన్స్ ఏదైతే ఉందో అది సినిమాకు ఇప్పుడు వచ్చిన బజ్ కి రీజన్ అని చెప్పొచ్చు. చాలాకాలం తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా తెలుగు రెండు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర సందడి చేస్తూ ఒక ఫెస్టివల్ వైబ్ ని తీసుకొచ్చారు.
ఐతే సినిమా చూసిన ఫ్యాన్స్ సూపర్ అంటున్నా.. కామన్ ఆడియన్స్ మిశ్రమ స్పందన ఇస్తున్నారు. వీరమల్లు యాక్చువల్ టాక్ ఏంటన్నది మండే రోజు తెలిసే ఛాన్స్ ఉంది. ఐతే ఈ వీకెండ్ మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.