నా మూత్రం వాళ్లకి ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారేమో - సీనియర్ నటుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్, లీడ్ రోల్స్ చేస్తున్న విషయం తెల్సిందే. పరేష్ రావల్ ఈ ఏడాదిలో ఇప్పటికే 'ది స్టోరీ టెల్లర్', 'నిఖితా రాయ్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాల్లోనూ పరేష్ రావల్ యొక్క నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా ఆయన పాత్రల వల్ల సినిమాలు నిలబడ్డాయి అనే రివ్యూలు వచ్చాయి. అలాంటి బలమైన పాత్రలను ఇప్పటికీ చేస్తున్న పరేష్ రావల్ గురించి ఇటీవల ట్రోల్స్ వినిపిస్తున్నాయి. మూత్రం తాగాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఇటీవల ఆయన నటించిన ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోకాళ్ళ నొప్పులు, మోకాలి గాయం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో అజయ్ దేవగన్ తండ్రి దివంగత వీరూ దేవగన్ చెప్పినట్లుగా రోజులో మొదటి మూత్రంను తాగడం జరిగింది. అలా చేసిన 15 రోజుల్లోనే మోకాలి గాయం పూర్తిగా నయం కావడంతో పాటు, సుదీర్ఘ కాలంగా వేదిస్తూ వచ్చిన నొప్పి తగ్గి పోయింది అంటూ చెప్పుకొచ్చాడు. నాలుగు దశాబ్దాల క్రితం ఇది జరిగింది. ఈ విషయాన్ని ఆయన చెప్పిన ఉద్దేశం వేరు, దాన్ని చాలా మంది అర్థం చేసుకున్నారు. కానీ కొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తూ, ట్రోల్స్ చేస్తూ, మీమ్స్ చేస్తూ ఉన్నారు.
ఆ ట్రోల్స్, మీమ్స్ పై పరేష్ రావల్ స్పందించాడు. తన గురించి కొందరు మీడియాలో చేస్తున్న ప్రచారం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నాడు. అప్పట్లో నా మూత్రం వారికి ఇవ్వలేదు, నేను మాత్రమే మూత్రం తాగడం వల్ల వారికి కోపం వచ్చింది. నా మూత్రం ఇవ్వలేదని ఫీల్ అయిన వారు, నా మూత్రం వారితో పంచుకోలేదని బాధ పడుతున్న వారు మాత్రమే నన్ను ట్రోల్ చేస్తున్నారని సీరియస్ విషయాన్ని కాస్త హ్యూమర్ యాడ్ చేసి మరీ స్పందించాడు. వారు మాకు ఇవ్వలేదు అనే బాధలో ట్రోల్ చేస్తూ ఉండవచ్చు, వారిని నేను ఏమీ అనడం లేదు. వారుముందు ముందు కూడా నన్ను ట్రోల్ చేస్తే పెద్దగా పట్టించుకోను అంటూ పరేష్ రావల్ అన్నాడు.
ఆ మధ్య సూపర్ హిట్ ప్రాంచైజీ హేరా ఫెరీ సినిమా విషయంలో పరేష్ రావల్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రాంచైజీ నుంచి తప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. సినిమా నటీ నటులు, సాంకేతిక నిపుణులు సైతం పరేష్ రావల్ గురించి కామెంట్స్ చేశారు. ఆ సమయంలో ఆయన తిరస్కరించినప్పటకీ ఆ తర్వాత ఓకే చెప్పారు. హేరా ఫేరి ప్రాంచైజీలో నటించబోతున్నట్లు పరేష్ రావల్ ప్రకటించాడు. తప్పకుండా తాను నటిస్తాను అని మేకర్స్ హామీ ఇచ్చాడని కూడా బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. వచ్చే ఏడాదికి హేరా ఫెరీ సినిమా కొత్త మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఎప్పటిలాగే ఈ సినిమా సైతం విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.