సమంత బ్యాక్ టు వర్క్... ఇంట్రెస్టింగ్ అప్డేట్
సమంత కొన్ని నెలల క్రితం తన సొంత నిర్మాణ సంస్థ లో మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.;
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె నటించిన సినిమాలేవి ఈమధ్య కాలంలో విడుదల కాలేదు. దాంతో సినిమాల గురించి ఆమె వార్తలు నిలవలేదు. ఆమె ప్రేమ వ్యవహారం ఇంకా ఇతర విషయాల గురించి మాత్రమే వార్తలు నిలుస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఆమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా తన ప్రేమ కథను సుఖాంతం చేసుకుంది. రెండోసారి వివాహం చేసుకున్న సమంత పెళ్లి ఫోటోల్లో చాలా సంతోషంగా కనిపిస్తోంది అంటూ అభిమానులు సోషల్ మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సమంతను ఇంత సంతోషంగా చూడలేదంటూ వారు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇక వర్క్ పై దృష్టి పెడుతుందని అంతా భావించారు.. అన్నట్లుగానే సమంత తన తదుపరి సినిమా పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం
సమంత కొన్ని నెలల క్రితం తన సొంత నిర్మాణ సంస్థ లో మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సమంత సొంత నిర్మాణ సంస్థలో ఈ ఏడాది శుభం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాను నిర్మించడం మాత్రమే కాకుండా చిన్న గెస్ట్ రోల్ చేయడం ద్వారా ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మా ఇంటి బంగారం సినిమాతో చాలా సర్ప్రైజ్ లను ప్లాన్ చేస్తుంది అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఫ్యామిలీ మూవీ అంటూనే చిన్న చిన్న ఎమోషనల్ కార్నర్స్ ని ఆమె టచ్ చేయబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. సమంత గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని ఆమె సన్నిహితులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. కనుక సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రెండో పెళ్లి చేసుకున్న సమంత
సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని సమాచారం అందుతుంది. ఇదే సమయంలో ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య నటిస్తున్నట్లు వెళ్లడయ్యింది. స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంతతో కలిసి వర్క్ చేయడం కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను, ఎట్టకేలకు ఆ కోరిక తీరింది. ఆమె నిర్మాణంలో, ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందాన్ని కలిగిస్తుందని గుల్షన్ దేవయ్య చెప్పుకొచ్చాడు. సినిమా గురించి ఎలాంటి వివరాలను చెప్పలేనని, కానీ ఒక మంచి పాత్రను ఈ సినిమాలో చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. కాంతార చాప్టర్ 1 సినిమాలో ఆయన పోషించిన పాత్రకి మంచి పేరు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఆయన సమంత మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తున్నాడు అనగానే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో ఆయన పాత్ర ఉండే విధంగా దర్శకురాలు నందిని రెడ్డి ప్లాన్ చేయాలని అంతా కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్ద హడావుడి లేదు, కానీ వచ్చే సంవత్సరం ఆరంభం నుంచి సినిమా గురించి ప్రచారం మొదలు పెట్టాలని భావిస్తున్నారట.
మా ఇంటి బంగారం సినిమాలో గుల్షన్ దేవయ్య
సమంత సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు మొదటి నుండి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమా కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా డబ్బు చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అక్కడ కూడా సమంత అభిమానులకు ఒక ప్రత్యేకమైన కానుకగా ఈ సినిమా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో మరియు వ్యక్తిగత సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇప్పుడు లేవు, అలాగే వ్యక్తిగత సమస్యలు ఇటీవల జరిగిన పెళ్లితో పూర్తిగా సర్దుమనిగాయి. దాంతో సమంత వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం సమంత నుంచి రెండు మూడు సినిమాలు కచ్చితంగా రావచ్చు అని అభిమానులు ఆశపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని సినిమాలు చేయాలని, మునుపటిలాగా బిజీగా మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని అంతా కోరుకుంటున్నారు.