శివ రాజ్ కుమార్ వెండితెర గుమ్మడి నర్సయ్య..!

తెర మీద మహా నాయకులు గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ కనిపించనున్నారు. ఈ సినిమాను ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.;

Update: 2025-12-05 07:31 GMT

ప్రజల కోసం పనిచేసే నిజమైన నాయకుడు నిజాయితీ గల రాజకీయవేత్త గుమ్మడి నర్సయ్య. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పటికీ సైకిల్ మీదే తిరిగే వ్యక్తి ఆయన. అలాంటి నిజాయితీ గల నాయకుడి జీవిత కథతో వస్తున్న సినిమా గుమ్మడి నర్సయ్య. వెండితెర మీద గుమ్మడి నర్సయ్యగా నటిస్తున్నారు కన్నడ స్టార్ శివన్న అలియాస్ శివ రాజ్ కుమార్. పరమేశ్వర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు.




 


గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో శివ రాజ్ కుమార్..

శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న శివ రాజ్ కుమార్ రంగంలోకి దిగారు. చిత్ర యూనిట్ తో కలిసి విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్న ఆయన శనివారం జరగబోతున్న సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివ రాజ్ కుమార్ తాను గుమ్మడి నర్సయ్య బయోపిక్ లో నటిస్తున్నా అని అనౌన్స్ చేశారు. అంతేకాదు తను ఇదివరకు చేసిన తెలుగు సినిమాల గురించి నెక్స్ట్ చరణ్ తో చేస్తున్న పెద్ది సినిమా గురించి ప్రస్తావించారు శివ రాజ్ కుమార్.

తెర మీద మహా నాయకులు గుమ్మడి నర్సయ్యగా శివ రాజ్ కుమార్ కనిపించనున్నారు. ఈ సినిమాను ఎన్. సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది బయోపిక్ సినిమాలు ప్రేక్షకులను అలరించగా రియల్ లీడర్.. పీపుల్ లీడర్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య జీవిత కథ తెర మీద ఆవిష్కరించడం ఆయన్ను ఇష్టపడే వారితో పాటు ఆయన గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఆసక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ బయోపిక్ లో శివ రాజ్ కుమార్ నటించడం వల్ల స్పెషల్ క్రేజ్ ఏర్పడింది.

రామ్ చరణ్ పెద్ది సినిమాలో..

శివ రాజ్ కుమార్ ఆల్రెడీ బాలయ్య 100వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణిలో స్పెషల్ రోల్ చేశారు. నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన లీడ్ రోల్ లో గుమ్మడి నర్సయ్య బయోపిక్ తో సినిమా వస్తుంది. ఈ సినిమా టీజర్ తోనే ఒక బజ్ క్రియేట్ చేయగా సినిమాతో మరింత ఇంపాక్ట్ చూపించాలని చూస్తున్నారు.

కన్నడ స్టార్ అయిన శివ రాజ్ కుమార్ తెలుగు సినిమాల మీద ఎప్పుడు తన ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. ఇప్పుడు గుమ్మడి నర్సయ్య జీవిత కథతో ఆయన చేస్తున్న ఈ బయోపిక్ తో మరింత తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వనున్నారు. రాజకీయాల్లో ప్రజల తరపున ఉంటూ.. నిజమైన నాయకుడి మాట, బాట ఎలా ఉంటుందో చూపించిన గుమ్మడి నర్సయ్య కథలో శివ రాజ్ కుమార్ అభినయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News