పొలిటికల్ ఎంట్రీ.. త్రిష సరైన ఆన్సర్ ఇవ్వనుందా?

సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్ పొలిటికల్ ఎంట్రీపై కొన్నిరోజులుగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2026-03-18 12:30 GMT

సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్ పొలిటికల్ ఎంట్రీపై కొన్నిరోజులుగా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజకీయాలకు సంబంధించిన వార్తలపై ఎక్కడా ఎప్పుడూ పెద్దగా స్పందించని ఆమె, ఇకపై మౌనం వీడే అవకాశం ఉందని సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు.

నిజానికి.. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు అనుబంధంగా ఉన్న కొంతమంది హీరోయిన్లు రాజకీయ విమర్శలపై స్పందించకుండా ఉండటం సాధారణంగా కనిపించే విషయం. కానీ త్రిష మాత్రం అలాంటి ధోరణికి భిన్నంగా ఉండబోతున్నారని ఇప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు తగిన సమాధానం ఇవ్వాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, తమిళనాడులో కొత్తగా ప్రారంభమైన విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) తరఫున త్రిష ఎన్నికల్లో పోటీ చేయవచ్చన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఆమె ఎంపిక చేసుకునే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్న త్రిషకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తే ఆమెకు మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సినీ ఇమేజ్‌ ను రాజకీయాల్లోకి మార్చుకోవడం అంత సులభం కాదని మరికొందరు సూచిస్తున్నారు.

గతంలో తమిళనాడు రాజకీయాల్లో హీరోయిన్ల ప్రభావం పెద్ద ఎత్తున కనిపించింది. ముఖ్యంగా జయలలిత వంటి నాయకురాలు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదగడం ఒక పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. అదే తరహాలో ఇప్పుడు త్రిష కూడా ముందుకు రావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, త్రిష ఇప్పటివరకు రాజకీయాల్లోకి వస్తానని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. ఆమె సన్నిహితులు కూడా ఆ వార్తలను ధ్రువీకరించలేదు.

దీంతో ఇవి కేవలం ఊహాగానాలుగానే చూడాలని కొందరు చెబుతున్నారు. ఇకపోతే, ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ నటిగా కొనసాగుతున్న త్రిష పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఆమె కెరీర్‌ పై ప్రభావం చూపుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా త్రిష పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఇవి నిజమా కాదా అన్నది ఆమె లేదా సంబంధిత పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News