ఉస్తాద్ పై డైరెక్ట‌ర్ కాన్ఫిడెన్స్.. ఇలాంటి సినిమా మళ్లీ రాదంటున్న హరీష్ శంకర్

ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది.;

Update: 2026-03-18 12:05 GMT

ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రిలీజైన‌ టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. గబ్బర్ సింగ్ తరహా మాస్ మేజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చాలా కాలం త‌ర్వాత ఇలాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీ వ‌స్తోంది

ఈ అంచనాలను మరింత పెంచేలా తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ సినిమాపై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపించింది. ఇలాంటి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చాలా కాలం తర్వాత వస్తోంది అన్న ఆయ‌న కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. పాటలు, డ్యాన్స్, డైలాగులు, యాక్షన్, హాస్యం.. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ను స‌మానంగా జోడించి ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ అందించేలా సినిమా రూపొందించామని ఆయన వెల్లడించారు.

ఫ్యాన్స్ ఆశించే అన్నీ అంశాలుంటాయి

ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేస్తూ ఈ సినిమా రూపొందిందనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. హెయిర్ స్టైల్ నుంచి బాడీ లాంగ్వేజ్ వరకు, డైలాగ్ డెలివరీ నుంచి కామెడీ టైమింగ్ వరకు.. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆశిస్తున్న అన్ని అంశాలు ఇందులో ఉంటాయని హరీష్ శంకర్ హామీ ఇచ్చారు. దీంతో ఈ సినిమా ఫ్యాన్స్ ఫీస్ట్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకసారి చూసిన ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు వచ్చేలా చేసే కంటెంట్ ఉంటుందనే కాన్ఫిడెన్స్ మేకర్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఎక్క‌డా రాజీ ప‌డ‌ని నిర్మాత‌లు

ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఈ సినిమా నిర్మాణంలో కనిపించిన ప్లానింగ్ మరియు డిసిప్లిన్. భారీ స్టార్ సినిమా అయినప్పటికీ, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయడం సులభం కాదు. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న క్రమశిక్షణాత్మక వైఖరి చిత్ర యూనిట్ కు పెద్ద బలం అయ్యిందని హరీష్ శంకర్ వెల్లడించారు. ముందుగానే షెడ్యూల్స్ ప్లాన్ చేయడం, సమయాన్ని కచ్చితంగా కేటాయించడం వల్ల ఎలాంటి ఆలస్యాలు లేకుండా ప్రాజెక్ట్ పూర్తయిందని చెప్పారు. ప్రొడక్షన్ హౌస్ కూడా ఎక్కడా రాజీ పడకుండా పూర్తి మద్దతు ఇవ్వడం సినిమాకి అదనపు బలం ఇచ్చింది.

ఈ అన్ని అంశాలను కలిపి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ కేవలం ఒక సినిమా కాకుండా, ఒక పండగ అనుభూతిని ఇవ్వబోతుందనే భావన కలుగుతోంది. ఉగాది సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అంచనాలు ఎంత పెద్దవో, ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఉండబోతుందనే నమ్మకం టీమ్‌లో గట్టిగా ఉంది.

Tags:    

Similar News