కేవీఎన్‌కు వివాదం ఎదురొస్తోందా..ఎదురెళుతున్నారా?
ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. బాబి దర్శకుడు. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ స్టోరీగా దీన్ని తెరపైకి తీసుకురావాలకున్నారు.;
కొంత మందికి టైమ్ కలిసిరాక, పరిస్థితుల అనుకూలించక వివాదాలు వెంటాడుతుంటాయా? అనే అనుమానాలు తలెత్తుతుంటాయి. కారణం వారు తలపెట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌ల చుట్టూ చిత్ర విచిత్రమైన వివాదాలు తలెత్తడంతో ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి అనుమానాలే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కెవీఎన్ ప్రొడక్షన్స్ విషయంలో ఎదురవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎన్నో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ మూవీస్‌ని కన్నడ నాట డిస్ట్రిబ్యూట్ చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
2021లో కన్నడ మూవీ `పొగరు`తో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించింది. ఆ తరువాత తెలుగు సినిమాలు `ఆర్ఆర్ఆర్` నుంచి `దేవర` వరకు కన్నడ ప్రేక్షకులకు అందించింది. ఇక తమిళ సినిమాలైన తంగలాన్, కంగువ, గుడ్ బ్యాడ్ అగ్లీ` అని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసింది. 2026 వరకు కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలని పంపిణీ చేసి మంచి పేరు తెచ్చుకుంది. తొలి సారి నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన గణేష్‌తో ఓ చిన్న సినిమాని నిర్మించింది. ఆ తరువాత అదే స్థాయి బడ్జెట్‌తో శ్రీలీల, ధన్‌వీర్ జంటగా `బై టు లవ్` మూవీ చేసింది.
ఈ రెండూ విజయం సాధించడంతో భారీ సినిమాలు నిర్మించాలనే లక్ష్యంతో ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. తొలి ప్రయత్నంగా అక్కడ దళపతి విజయ్ హీరోగా `జన నాయగన్` మూవీని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` ఆధారంగా రూపొందిన ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కావాల్సింది. అయితే సెన్సార్ వివాదం కారణంగా సినిమా రిలీజ్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోవడం గమనార్హం.
ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. బాబి దర్శకుడు. తండ్రీ కూతుళ్ల నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ స్టోరీగా దీన్ని తెరపైకి తీసుకురావాలకున్నారు. `జన నాయగన్` కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించబోతున్నారు. ఇక ఇదే ఏడాది రాకింగ్ స్టార్ యష్‌తో కలిసి `టాక్సిక్` మూవీని నిర్మించారు. గ్లింప్స్‌తోనే వివాదాలని స్టార్ట్ చేసింది. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం తెలిసిందే.
ఈ మూవీని ముందు మార్చి 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే `ధురంధర్ 2` మోన్‌స్టార్‌లా ఇదే రోజు రిలీజ్ అవుతుండటం, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం మొదలు కావడం వంటి కారణాలతో రిలీజ్‌ని జూన్ 4కు వాయిదా వేశారు. ఇక ఇదే సమయంలో దృవ్ సర్జాతో `కేడి ది డెవిల్`ని నిర్మించారు. భారీ తారాగణం కిచ్చా సుదీప్, సంజయ్ దత్, శిల్పాశెట్టి, వి. రవిచంద్రన్..వంటి నటీనటులతో ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఏప్రిల్ 30 ని రిలీజ్ డేట్ ఇచ్చేశారు. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టి సంజయ్‌దత్, నోరా ఫతేహిపై చిత్రీకరించగా మంగ్లీ పాడిన `సర్కే చునర్ సర్కే` అంటూ సాగే పాట వివాదాస్పదంగా మారింది.
ఇందులో వాడిన పదాలు జుగుప్సాకరంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్స్ రావడంతో కేంద్రం దీనిపై సీరియస్‌గా స్పందించింది. ఈ పాట ఏఏ ప్లాట్ ఫామ్‌లలో ఉందో అన్నింటి నుంచి వెంటనే తొలగించాలని సెన్సార్ బోర్డ్‌ని ఆదేశించడంతో వివాదం తారా స్థాయికి చేరింది. దీనిపై దర్శకుడు ప్రేమ్ వైఫ్. ఒకప్పుటి క్రేజీ హీరోయిన్ రక్షిత స్పందిస్తూ ఇంత వరకు వచ్చిన ఈ తరహా పాటలని ఉదాహరణగా చూపించడంతో వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందోననే చర్చ మొదలైంది. ఇలా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమాలు వివాదాల్లో చిక్కుకుంటుండటంతో వారే వివాదాల్ని కొని తెచ్చుకుంటున్నారా?.. లేక వివాదాలే వారిని వెతుక్కుంటూ వస్తున్నాయా? అనే చర్చ జరుగుతోంది.