పుష్ప తో ప్రేమ, శక్తి, ధైర్యం.. !

నేటితో పుష్ప 2 రిలీజై ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా పుష్ప జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.;

Update: 2025-12-05 07:33 GMT

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప రెండు భాగాలు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. సుకుమార్ డైరెక్షన్ లో ఇదివరకు ఆర్య, ఆర్య 2 చేసిన అల్లు అర్జున్ ఈసారి పుష్ప రాజ్ పాత్రలో మాస్ బొమ్మతో వచ్చాడు. పుష్ప 1 అండ్ 2 రెండు సినిమాలు కూడా మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమా బీ టౌన్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. నేటితో పుష్ప 2 రిలీజై ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా పుష్ప జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

పుష్ప కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుకుమార్..

పుష్ప సినిమా ఒక మర్చిపోలేని జర్నీ అని.. ఐదేళ్లు ఆ సినిమా కోసం పనిచేశామని అన్నారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రేమ, శక్తి, ధైర్యాన్ని పొందామని అన్నారు. ఈ సినిమాను గొప్ప ఆదరించిన దేశంలో ఉన్న వారు.. ఇతర దేశాల వారికి థాంక్స్. పుష్ప సినిమా కోసం పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్, టెక్నిషియన్, మొత్తం యూనిట్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుకుమార్ గారికి అందరికీ ప్రత్యేకంగా థాంక్స్. పుష్పకు ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ ఒక స్పెషల్ నోట్ తన ఎక్స్ లో రాసుకొచ్చారు.

ఈ కామెంట్ తో పాటు సుకుమార్ తనకు సీన్ వివరిస్తున్న ఒక ఫోటో అందులో అల్లు అర్జున్ ఖాకీ డ్రెస్ తో ఉన్న ఫోటో షేర్ చేశారు. పుష్ప 1 అండ్ 2 సినిమాలు సౌత్ ఆడియన్స్ కి మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టించింది. ఐతే పుష్ప 2 చివర్లో పుష్ప 3 రాంపేజ్ అనౌన్స్ చేశారు మేకర్స్. మరి ఆ సినిమా ఎప్పుడొస్తుందో తెలియదు కానీ సినిమా ఎప్పుడు వచ్చినా సరే నెక్స్ట్ లెవెల్ గ్యారెంటీ అనేస్తున్నారు ఆడియన్స్.

పుష్ప 3 కోసం ఆడియన్స్ ఆసక్తిగా..

పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో రష్మిక మందన్న శ్రీవల్లి రోల్ లో అదరగొట్టేసింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా పుష్ప రెండు భాగాలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

పుష్ప 2 తర్వాత పుష్ప 3 ఉంటుందని అనౌన్స్ చేశాడు సుకుమార్. ఐతే పుష్ప 3 కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉండగా ఆ మూవీ 3 ఏళ్ల తర్వాతే కుదురుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సుకుమార్ నెక్స్ట్ రాం చరణ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 తర్వాత అట్లీతో చేస్తున్న సినిమాతో కూడా అల్లు అర్జున్ భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో సూపర్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.



Tags:    

Similar News