అల్లు అర్జున్ ఊర మాస్ లైనప్..!
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ప 1 కన్నా పార్ట్ 2 మరింత ఇంపాక్ట్ చూపించింది.;
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అల్లు అర్జున్ స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ప 1 కన్నా పార్ట్ 2 మరింత ఇంపాక్ట్ చూపించింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప ది రూ, పుష్ప ది రైజ్ రెండు కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. పుష్ప తర్వాత అల్లు అర్జున్ అసలైతే త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడని వార్తలు రాగా గురూజీ సినిమాకు ముందే అట్లీతో సినిమా లైన్ చేశాడు అల్లు అర్జున్. ఇండియన్ స్క్రీన్ మీద మరో సూపర్ హీరో కథతో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ భారీగా ఈ సినిమా నిర్మించబోతున్నారు.
ఇమిడియెట్ గా త్రివిక్రమ్ తో సినిమా..
ఈ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ లైనప్ చూస్తే ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే ఉంది. నెక్స్ట్ ఇమిడియెట్ గా త్రివిక్రమ్ తో సినిమా ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ కాంబినేషన్ సినిమా అంటే పక్కా హిట్ అన్నట్టే లెక్క. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అన వైకుంఠపురములో సినిమాలు హ్యాట్రిక్ హిట్లు అందుకున్నాయి. ఇక త్రివిక్రం తర్వాత బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలితో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
పుష్ప 2 తర్వాత ముంబైలో అల్లు అర్జున్ సంజయ్ లీలా భన్సాలి ఆఫీస్ లో కనిపించిన టైం లోనే ఈ కాంబినేషన్ సినిమాపై న్యూస్ వైరల్ అయ్యింది. ఐతే భన్సాలి నెక్స్ట్ అల్లు అర్జున్ తోనే సినిమా ప్లాన్ చేస్తున్నారట. సంజయ్ లీలా భన్సాలితో పాటు మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ తో కూడా అల్లు అర్జున్ సినిమా ప్లానింగ్ ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ తో బసిల్ టచ్ లోనే ఉన్నాడని టాక్.
యంగ్ ఫిల్మ్ మేకర్ బసిల్ జోసెఫ్..
మలయాళంలో యంగ్ ఫిల్మ్ మేకర్ గా బసిల్ జోసెఫ్ చేస్తున్న సినిమాలు అటు థియేట్రికల్ హిట్స్ మాత్రమే కాదు ఓటీటీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్ డైరెక్టర్స్ లిస్ట్ లో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా ఉన్నాడని తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ లో అల్లు అర్జున్ ఉన్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా తప్పకుండా ఆడియన్స్ ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ వచ్చే అవకాశం ఉంది.
లోకేష్ తర్వాత కె.జి.ఎఫ్, సలార్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ నీల్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేసే ప్లాన్ ఉందట. ప్రస్తుతం ఎన్ టీ ఆర్ తో సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ ఆ ప్రాజెక్ట్ తర్వాత సలార్ 2 చేయాల్సి ఉంది. ఆ నెక్స్ట్ అల్లు అర్జున్ తోనే మరో భారీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సో ఇలా అల్లు అర్జున్ తన డైరెక్టర్స్ లిస్ట్ ని రెడీ చేసుకుంటున్నాడు. అల్లు అర్జున్ 22వ సినిమా అదే అట్లీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా 2026 జూన్ లోగా కంప్లీట్ చేసి 2027 రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంది
సో నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా గురించి ఏదో ఒక అప్డేట్ ఇస్తాడు. అప్డేట్ ఇవ్వడమే కాదు వెంటనే షూటింగ్ కూడా మొదలు పెడతారని తెలుస్తుంది. మొత్తానికి అట్లీ తర్వాత అల్లు అర్జున్ తో నెక్స్ట్ తీసే ఐదుగురు డైరెక్టర్స్ లిస్ట్ అల్లు ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.