అర్జున్ టెండూల్కర్ వెడ్డింగ్ వీడియో .. సోషల్ మీడియాలో చర్చకు!

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ల వివాహం మార్చి 5న అత్యంత వైభవంగా జరిగింది.;

Update: 2026-03-06 08:05 GMT

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ల వివాహం మార్చి 5న అత్యంత వైభవంగా జరిగింది. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. వేదికపై కొత్త జంట ఉన్న సమయంలో అర్జున్ ప్రవర్తనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అభినందనలు తెలుపుతుంటే, మరికొందరు ఆయన బాడీ లాంగ్వేజ్‌ను ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఎంతటి చర్చకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఆ వివరాలు చూద్దాం..

వైరల్ వీడియో.. నెటిజన్ల భిన్న వాదనలు:

పెళ్లి వేడుకలో భాగంగా అర్జున్, సానియా చేతులు పట్టుకుని వేదికపై నిలబడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. ఆ సమయంలోస్టేజి పైన ఒక గాయకురాలు రొమాంటిక్ సాంగ్ పాడుతుండగా, అర్జున్ కొంచెం సిగ్గుపడుతూ, అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించారు. ఈ వీడియో బయటకు వచ్చిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక అర్జున్ మొహం చాటేస్తున్నాడని, ఏదో అయిష్టంగా ఉన్నాడంటూ కొందరు ట్రోలర్స్ విమర్శలు మొదలుపెట్టారు. మరికొందరు అయితే ఒక అడుగు ముందుకు వేసి, వారి వ్యక్తిగత జీవితంపై లేనిపోని ఊహాగానాలు షేర్ చేయడం గమనార్హం.

సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్.. ఇది కేవలం ఇంట్రోవర్ట్ లక్షణం:

అర్జున్‌పై వస్తున్న నెగటివ్ కామెంట్లను ఆయన అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం ఒకేలా ఉండదు, అర్జున్ సహజంగానే కొంచెం సిగ్గుపడే స్వభావం కలవాడు. అంతమంది జనం ముందు ఆ మాత్రం బెరుకు ఉండటం సహజం అంటూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక కేవలం కొన్ని సెకన్ల వీడియోను చూసి ఒకరి వ్యక్తిత్వాన్ని లేదా వారి వైవాహిక బంధాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలుకుతున్నారు. సెలబ్రిటీలైనంత మాత్రాన వారికి ప్రైవసీ ఉండదా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

సోషల్ మీడియా ట్రోలింగ్.. సెలబ్రిటీలపై ఒత్తిడి:

ఇక సచిన్ కుమారుడిగా అర్జున్ టెండూల్కర్ ఎప్పుడూ కెమెరా కళ్ల ముందే ఉంటారు. క్రికెట్ కెరీర్‌లో తండ్రితో పోలికలు, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ఇలాంటి విమర్శలు ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వైరల్ కంటెంట్ కోసం కొందరు వ్యక్తులు ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇలాంటి విషయాల్లో సామాన్య నెటిజన్లు విజ్ఞతతో వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక ఏదేమైనా, ఈ వెడ్డింగ్ వీడియో వల్ల అర్జున్ పెళ్లి వ్యవహారం మరోసారి ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. పెళ్లి అనేది ఒకరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను పట్టించుకోకుండా, కొత్త జంట తమ ప్రయాణాన్ని సంతోషంగా సాగించాలని కోరుకుందాం అని ఫాన్స్ అంటున్నారు.



Tags:    

Similar News