ఇప్పుడు కాదు, 3 ఏళ్ల క్రితమే సమంత తప్పుకుంది!

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెల్సిందే. సమంత గర్భం దాల్చడం వల్ల పలు సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది.

Update: 2026-09-19 07:43 GMT

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం గర్భవతి అనే విషయం తెల్సిందే. సమంత గర్భం దాల్చడం వల్ల పలు సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. కొన్ని కమిట్‌ అయిన సినిమాలను సమంత డేట్ల కారణంగా వదిలేసిందట. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉండగానే నో చెప్పిందట. మా ఇంటి బంగారం సినిమా తర్వాత సమంత ఒక యాక్షన్‌ మూవీతో రావాల్సి ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలు అయ్యాయి. కానీ సమంత గర్భం దాల్చడం వల్ల సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. మరో హీరోయిన్‌తో ఆ సినిమా చేస్తారా లేదంటే సమంత వచ్చే వరకు వెయిట్‌ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇదే సమయంలో సమంత 'చెన్నై స్టోరీ' అనే సినిమా నుంచి కూడా తప్పకుందనే వార్తలు వస్తున్నాయి. గర్భం దాల్చడం వల్ల ప్రతిష్టాత్మక ఇండో-యూకే సినిమా నుంచి సమంత తప్పుకుంది అనే వార్తలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

సమంత ఇండో-యూకే మూవీ చెన్నై స్టోరీ...

అసలు విషయం ఏంటంటే ఇండో-యూకే మూవీ 'చెన్నై స్టోరీ' నుంచి సమంత దాదాపు మూడు ఏళ్ల క్రితమే తప్పుకుంది. సినిమాను 2022 నవంబర్‌ నెలలో ప్రకటించారు. ఆ సమయంలో ఈ సినిమాకు సమంత బెస్ట్‌ ఎంపిక అంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సమంత సైతం ఈ ఇండో యూకే మూవీని చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రైవేట్‌ డిటెక్టివ్‌ పాత్రలో సమంత కనిపించబోతుందని కూడా మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది. 'ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్‌ లవ్‌' అనే నవల ఆధారంగా రూపొందబోతున్న సినిమా అంటూ ప్రకటన చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ముందుకు సాగలేదు. ఆ సమయంలోనే సమంతకు మయో సైటిస్‌ సమస్య మొదలైంది. దాంతో సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. పైగా షూటింగ్‌ ప్రారంభం కాకపోవడంతో ఆమె సున్నితంగా ప్రాజెక్ట్‌ నుంచి బయట పడిందనే వార్తలు వచ్చాయి.

సమంత అనారోగ్య సమస్యల కారణంగా...

సమంత 'చెన్నై స్టోరీ' సినిమా నుంచి 2024లోనే బయటకు వచ్చిందనే వార్తలు వచ్చాయి. అనారోగ్య సమస్యల కారణంగా సినిమా చేయడం సాధ్యం కాదని సమంత తేల్చి చెప్పడంతో మేకర్స్ పలువురు హీరోయిన్స్‌ను పరిశీలించి, చివరకు తమిళ్‌ తెలిసిన నటి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో శృతి హాసన్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఆమె సైతం సినిమాను చేయబోతున్నట్లుగా 2024లోనే ప్రకటించింది. శృతి హాసన్‌ను ప్రకటించి రెండు ఏళ్లు దాటింది. అయినా ఇప్పటి వరకు షూటింగ్‌ ప్రారంభం కాలేదు. ఏవో కారణాల వల్ల సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు సినిమా గురించి మళ్లీ చర్చ మొదలైంది. సమంత ప్లేస్‌ లో శృతి హాసన్‌ను ఎంపిక చేశారని, త్వరలో షూటింగ్‌ ను ప్రారంభించే యోచనలో మేకర్స్ ఉన్నారంటూ కొన్ని హ్యాండిల్స్ కథనాలు రాస్తున్నాయి.

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత...

చెన్నై స్టోరీ సినిమాను సమంత ఎప్పుడో వదిలేస్తే ఇప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకుందని, గర్భం దాల్చడం వల్ల సినిమా నుంచి తప్పుకుందని కథనాలు రావడం విడ్డూరంగా ఉందని కొందరు అంటున్నారు. సమంత మళ్లీ సినిమా షూటింగ్‌ కి హాజరు కావాలంటే కనీసం ఏడాది అయినా పడుతుంది. అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్‌ చేయక తప్పదు. తల్లిగా అయిన తర్వాత సమంత కొన్నాళ్ల పాటు అయినా పూర్తిగా బిడ్డకు సమయం కేటాయించే అవకాశాలు లేకపోలేదని, కనుక సమంత కొత్త సినిమా ప్రారంభం కావడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. మొత్తానికి సమంత ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. ముఖ్యంగా చెన్నై స్టోరీ సినిమా నుంచి దాదాపు మూడు ఏళ్ల క్రితమే తప్పుకుంది అనేది ఆమె సన్నిహితుల మాట. ఇక సమంత సినిమాల గురించి మీడియాలో వచ్చే కథనాలన్నింటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News