ప్యారడైజ్ లో నాని కొద్దిసేపు అలా కనిపించబోతున్నాడా..?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద గత సంవత్సర కాలం నుంచి ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అయిందో అప్పటినుంచి సినిమా మీద అంచనాలు తార స్థాయికి వెళ్లిపోయాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటితో ముందుకు దూసుకెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది... రీసెంట్ గా సినిమా యూనిట్ మొత్తం సినిమాను వీక్షించారట. నాని ఇంట్రడక్షన్ ఫైట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడుగా ఇంటర్వెల్ కి ఒక 20 నిమిషాల ముందు నాని ప్రళయ కాళా రుద్రుడిలా కనిపిస్తారట. ఇప్పటివరకు నాని లో ఎవ్వరు చూడనటువంటి ఒక యాంగిల్ ని ఈ మూవీలో చూడబోతున్నాం అనే న్యూస్ కూడా వినిపిస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాతో నాని నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ ని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఈనెల 24వ తేదీ నుంచి ప్యారడైజ్ సినిమా ప్రభంజనం మొదలుకానుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
టికెట్లు బుకింగ్ కి ఎప్పుడు పెడతారు అనే ఇంట్రెస్ట్ తో ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో మేకర్స్ సైతం ఈ సినిమా మీద ఉన్న అంచనాలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే సినిమా కంటెంట్ ని చాలా పకడ్బందీ ప్రణాళికలతో రూపొందించారట. ఎడిటింగ్ టేబుల్ వద్ద కూడా చాలావరకు అనవసరమైన సన్నివేశాలను కట్ చేస్తూ పేక్షకులకు ఏదైతే ఇంట్రెస్ట్ ని కలిగిస్తుందో, అలాగే కంటెంట్ కి ఏదైతే అవసరమో అలాంటి సీన్స్ ను మాత్రమే ఉంచుతున్నారట.
అనవసరమైన సన్నివేశాలను నిర్ధాక్షిణ్యంగా కట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎడిటింగ్ టేబుల్ మీద ఫైనల్ కట్ ని కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ ని ఇస్తుందో తెలియాలంటే మరో 5 రోజులపాటు వెయిట్ చేయాల్సిందే... ఈ మూవీ తర్వాత శ్రీకాంత్ ఓదెల చిరంజీవి తో ఒక పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది తనకి చాలా కీలకమనే చెప్పాలి...