శర్వా అయిదేళ్ల ఎదురు చూపులకు 'కామెడీ'తో తెర పడేనా?
శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'జార్జ్ క్రిష్' మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు.
శర్వానంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న 'జార్జ్ క్రిష్' మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లుగా యూనిట్ సభ్యులు ప్రకటించారు. శ్రీను వైట్ల మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ మొదటి నుంచి చెబుతున్నారు. దూకుడు వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన శ్రీనువైట్ల నుంచి మళ్లీ ఆ స్థాయి విజయాన్ని, ఆ రేంజ్ కామెడీ మూవీని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. శర్వానంద్‌తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న మూవీ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో శర్వానంద్‌ను చూడని సరికొత్త అవతారంలో చూస్తారని కూడా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. శ్రీనువైట్ల అనగానే కామెడీ మూవీస్ గుర్తుకు వస్తాయి. కనుక జార్జ్ క్రిష్ అదే తరహా కామెడీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందనే నమ్మకంతో శర్వా ఫ్యాన్స్ ఉన్నారు.
బైకర్ సినిమాతో వచ్చిన శర్వానంద్...
ఈ ఏడాదిలో శర్వానంద్ ఇప్పటికే 'నారి నారి నడుమ మురారి', 'బైకర్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు పర్వాలేదు అన్న టాక్ తో ఆలా ఆలా లాగేసాయి . గత అయిదు ఏళ్లుగా శర్వానంద్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేక పోయాయి. మధ్యలో ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా శర్వా ఫ్యాన్స్ మాత్రం సంతృప్తి చెందలేదు. శర్వానంద్ స్థాయికి తగ్గ సినిమా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్‌గా శ్రీనువైట్లతో శర్వానంద్ మూవీ ప్రకటించిన నేపథ్యంలో అయిదు ఏళ్ల ఎదురుచూపులకు కామెడీ మూవీతో తెర పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. శ్రీనువైట్ల గత సినిమాల ఫలితాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా, శర్వానంద్ ఎంపిక చేసుకున్నాడు కనుక కచ్చితంగా కథలో పాయింట్ ఉంటుంది, మంచి కంటెంట్ ఉండటం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్...
శ్రీనువైట్ల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు హీరోయిన్‌గా మానస వారణాసిని ఎంపిక చేయడం జరిగింది. ఆమె టాలీవుడ్‌లో ఈ సినిమాతో కచ్చితంగా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. కాస్త గ్యాప్ తీసుకున్న శ్రీను వైట్ల తన పాత కాంబినేషన్‌తో కలిసి వర్కౌట్ చేసి, ఈ స్క్రిప్ట్ ను రాశాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో సూపర్ హిట్స్ ఇచ్చిన కాంబో కావడం వల్లే జార్జ్ క్రిష్ సినిమా విషయమై మేకర్స్‌తో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.
జార్జ్ క్రిష్ మూవీని 2027 సంక్రాంతికి...
ఈ సినిమాను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేసే విధంగా ప్లాన్ చేశారట. అంతే కాకుండా శర్వానంద్ మార్కెట్, శ్రీను వైట్ల గత సినిమాల ఫలితాల నేపథ్యంలో బడ్జెట్ పరిమితంగా ఉంటుందని, తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం వల్ల తప్పకుండా బడ్జెట్ హద్దులు దాటక పోవచ్చు అంటున్నారు. నవంబర్ వరకు సినిమా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను ముగించనున్నారు. జనవరి మొదటి వారం నుంచి సినిమా ప్రమోషన్ హడావిడి మొదలు కానుంది. కచ్చితంగా సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో దర్శకుడు శ్రీను వైట్ల ఉన్నాడు. ఈ మధ్య కాలంలో సంక్రాంతి సినిమాలకు మంచి స్పందన వస్తుంది. కనుక సెంటిమెంట్ ప్రకారం జార్జ్ క్రిష్ సినిమాకు సంక్రాంతి కలిసి వచ్చి హిట్ కొట్టేనా చూడాలి.