శర్వానంద్ 'భోగి'.. నెవ్వర్ బిఫోర్​ లుక్ తో హైపెక్కించారుగా!

టాలీవుడ్ యంగ్ హీరో, ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోగి నుంచి విడుదలైన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;

Update: 2026-03-06 08:02 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోగి నుంచి విడుదలైన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఆ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన కొత్త మాస్ లుక్‌ ను విడుదల చేయగా, అందరినీ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది.




 


ఆ పోస్టర్‌ లో శర్వానంద్ పూర్తిగా భిన్నమైన అవతార్ లో కనిపిస్తున్నారు. ముదురు గడ్డంతో, చెమటలతో నిండిన ముఖం, నోటిలో బీడీ, కళ్లలో ఇంటెన్సటీతో ఆయన లుక్ ఎంతో రఫ్‌ అండ్ రగ్డ్ గా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా క్లాసీ రోల్స్ లో కనిపించిన శర్వానంద్.. ఇప్పుడు భోగి సినిమాలో మాత్రం మాస్ రోల్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించి ప్రేక్షకులతోపాటు అభిమానులను సర్ప్రైజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సినిమాలో శర్వానంద్ గంగ అనే పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. "నిశ్శబ్దంలో జన్మించిన తుఫాను.. విస్ఫోటనం కోసం వేచి ఉన్న కోపం" అనే ట్యాగ్‌ లైన్‌ తో విడుదల చేసిన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. త్వరలో భోగి వరల్డ్ లో గంగ కోపాన్ని చూడబోతోందని చిత్రబృందం తెలిపింది. అదే సమయంలో కొత్త పోస్టర్ అదిరిపోయిందని, సినిమాపై హైప్ పెరిగిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. 1960స్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఆ కాలంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు సంపత్ నంది సినిమాను రూపొందిస్తున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంత సంస్కృతి, వాతావరణాన్ని ప్రతిబింబించేలా మూవీని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

మూవీలో శర్వానంద్ సరసన హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారి లుక్స్ ఆకట్టుకున్నాయి. యాక్షన్‌ తో పాటు ఎమోషన్స్, లవ్ స్టోరీ సినిమాలో మెయిన్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల భారీ స్థాయిలో 20 రోజులపాటు యాక్షన్ షెడ్యూల్ నిర్వహించినట్టు సమాచారం.

ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ పర్యవేక్షణలో ఆ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఆ ఫైట్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌ గా నిలవనున్నాయని తెలుస్తోంది. నిర్మాత కేకే రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌ పై చిత్రాన్ని భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. దర్శకుడి విజన్‌ కు అనుగుణంగా ప్రత్యేకంగా 20 ఎకరాల్లో భారీ సెట్‌ ను నిర్మించినట్టు గతంలో మేకర్స్ తెలిపారు. ఆ సెట్ నిర్మాణానికి దాదాపు ఆరు నెలలపాటు శ్రమించినట్లు సమాచారం. ఏదేమైనా భోగి మూవీ.. శర్వాకు ఎలాంటి హిట్ ఇస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News