ఐబొమ్మ రవి కేసు.. సోదరి పాత్ర ఉందా? అందులో నిజమెంత?
అయితే ఐబొమ్మ రవి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన అతడు.. మరికొన్నింటికి మాత్రం తప్పించుకున్నాడని పోలీసులు ఇప్పటికే తెలిపారు.;
కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇమంది రవి.. అదే ఐబొమ్మ రవి పేరు హాట్ టాపిక్ గా మారింది. కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి.. ముఖ్యంగా టాలీవుడ్ చిత్ర సీమకు కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చేలా చేశాడు. దాదాపు ఇప్పటి వరకు 21 వేలకు పైగా సినిమాలను పైరసీ చేశాడు.
కొన్ని రోజుల క్రితం దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరి.. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు ఐబొమ్మ రవి. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అతడిని రెండు సార్లు కస్టడీ విచారణకు తీసుకున్నారు పోలీసులు. ఇప్పుడు మరోసారి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని రోజుల పాటు కస్టడీని కోర్టు విధించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఐబొమ్మ రవి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన అతడు.. మరికొన్నింటికి మాత్రం తప్పించుకున్నాడని పోలీసులు ఇప్పటికే తెలిపారు. తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా అన్నట్లు సమాధానాలు ఇచ్చాడని చెప్పారు. మూడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్నట్లు కూడా పేర్కొన్నారు.
రీసెంట్ గా కస్టడీలో అతడికి పోలీసులు జాబ్ ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. సైబర్ క్రైమ్ విభాగంలో పని చేస్తావా, మంచి జీతం ఇస్తామని ఆఫర్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకు రవి ఒప్పుకోలేదని టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు పోలీసులు స్పష్టంగా తెలియజేశారు.
తాము ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని, అదంతా తప్పుడు సమాచారం అని పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆ తర్వాత ఐబొమ్మ రవికి సోదరి చంద్రిక, స్నేహితుడు నిఖిల్.. పూర్తిగా సపోర్ట్ చేశారని.. బ్యాక్ బోన్ గా నిలిచారన్న వార్తలపై కూడా స్పందించారు. రవి విషయంలో అతడి సోదరిది మాత్రం ఎలాంటి పాత్ర లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
కేవలం అతడు సంపాదించిన డబ్బుల్లో కొంత మొత్తంలో ఆమెకు ఇచ్చాడని రవి చెప్పినట్లు తెలిపారు. ఆ విషయంపై విచారణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. కానీ ఫ్రెండ్ నిఖిల్ మాత్రం.. రవికి చాలా విషయాల్లో సహాయం చేశాడని అన్నారు. పోస్టర్ క్రియేషన్, కంటెంట్ ను డిఫైన్ చేయడంతోపాటు అప్లోడింగ్ సహా అనేక విధాలుగా నిఖిల్ హెల్ప్ ను రవి తీసుకున్నట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.