50 ఏళ్ల వయసులో కూడా అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బ్యూటీ!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ మధ్యకాలంలో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్ గా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు 60కోట్ల చీటింగ్ కేసులో చిక్కుకున్నారు.;

Update: 2025-12-05 06:06 GMT

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ మధ్యకాలంలో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. రీసెంట్ గా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు 60కోట్ల చీటింగ్ కేసులో చిక్కుకున్నారు. ఇప్పటికే వీరిపై కేసు నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో తాజాగా తన ఫోటోలతో శిల్పా శెట్టి ఇంటర్నెట్ ని షేక్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కోర్టు కేసులతో సతమతమవుతున్నప్పటికీ తన అభిమానులని మాత్రం అందాలతో అలరిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసుకుంది.



 


కోర్టు కేసులు నడుస్తున్న గందరగోళం నుండి కాస్త ప్రశాంతంగా పక్కకు తప్పుకొని ట్రెండీ ఫోజులతో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన శిల్పా శెట్టి ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 50 ఏళ్ల వయసులోనూ ఈ అందం ఏంటి తల్లి..అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా అంటూ వైరల్ కామెంట్స్ పెడుతున్నారు.మరి కొంతమంది మాత్రం ఎప్పటిలాగే శిల్పా శెట్టి అందాలకు మెస్మరైజ్ అవుతూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.



 


శిల్పా శెట్టి సినిమాల విషయానికి వస్తే..ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది కన్నడలో 'KD: ది డెవిల్' అనే మూవీలో కనిపించింది. చాలామంది శిల్పా శెట్టి తిరిగి సౌత్ లో నటిస్తుందని అనుకున్నారు.అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్ సమయంలో మళ్లీ తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పింది.కానీ ఇప్పటివరకు శిల్పా శెట్టికి తెలుగు ఇండస్ట్రీ నుండి ఎలాంటి స్క్రిప్ట్ మాత్రం వెళ్లలేదట. మరి ముందు ముందు అయినా ఈ హీరోయిన్ కి తెలుగు సినిమాల్లో మళ్ళీ అవకాశాలు ఇస్తారా అనేది చూడాలి.



 


ఇక శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇద్దరిపై దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త చీటింగ్ కేసు పెట్టారు.. దీపక్ కొఠారీ తన ఫిర్యాదులో ఈ విధంగా తెలిపారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ఇద్దరూ తమ కంపెనీకి చెందిన బెస్ట్ డీల్ టీవీ కంపెనీ లో పెట్టుబడి పెట్టమని 2015 - 2023 మధ్యకాలంలో తెలిపారు. నేను 2023 వరకు 60 కోట్లు పెట్టుబడి పెట్టాను. కానీ నేను పెట్టిన పెట్టుబడి రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలు తమ వ్యక్తిగత అవసరాలకు వాడుకొని దుర్వినియోగం చేశారు అంటూ ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ECW) లో దీపక్ కోఠారి ఫిర్యాదు చేశారు. దాంతో శిల్పా శెట్టి దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదయింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ హైకోర్టు వీరి పిటిషన్ ని కొట్టి పారేసింది.



 


Tags:    

Similar News