సమ్మర్ రేసులో హీరోయిన్ల సందడి!

ఒక‌ప్పుడు వేసవి వచ్చిందంటే ? బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండేది కాదు. కానీ నేడు స‌న్నివేశం అంద‌కు భిన్నంగా క‌నిపిస్తుంది.;

Update: 2026-03-19 04:22 GMT

ఒక‌ప్పుడు వేసవి వచ్చిందంటే ? బాక్సాఫీస్ వద్ద సందడి మామూలుగా ఉండేది కాదు. కానీ నేడు స‌న్నివేశం అంద‌కు భిన్నంగా క‌నిపిస్తుంది. కొత్త సినిమా రిలీజ్ లు త‌గ్గిపోవ‌డంతో హ‌డావుడి తగ్గింది. అయితే సినిమా అనేది ఎప్పుడు రిలీజ్ అయినా? హీరోల‌తో పాటు హీరోయిన్లు కూడా పోటీలో క‌నిపిస్తుంటారు. ఈసారి సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య కూడా గట్టి పోటీ నెలకొంది. తమ కెరీర్‌ను మలుపు తిప్పే కీలక చిత్రాలతో పలువురు ముద్దుగుమ్మలు ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్, నభా నటేష్, సంయుక్త మీనన్ ,భాగ్యశ్రీ బోర్సే వంటి భామలకు ఈ సీజన్ అత్యంత కీలకంగా మారింది.

టాలీవుడ్ సీతమ్మ మృణాల్ ఠాకూర్ యువ హీరో అడవి శేష్‌తో కలిసి న‌టిస్తోన్న `డెకాయిట్` ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు క్లాస్ , ఎమోషనల్ పాత్రల్లో మెప్పించిన మృణాల్ ఈ చిత్రంలో కాస్త రఫ్ అండ్ టఫ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. అడవి శేష్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఈ సినిమా సక్సెస్ మృణాల్‌ను కమర్షియల్ యాక్షన్ జోనర్‌లో కూడా టాప్ హీరోయిన్‌గా నిలబెడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జ‌రిగితే మృణాల్ ఖాతాలో మ‌రో భారీ విజ‌యం న‌మోదైన‌ట్లే. పాత్ర‌ల విష‌యంలో ఎంతో సెల‌క్టివ్ గా ఉండే అమ్మ‌డు ఫార్ములా మరోసారి స‌క్సెస్ అయిన‌ట్లే.

నిఖిల్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా `స్వయంభు`. ఈ సినిమాలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు నభా నటేష్ - సంయుక్తా మీనన్ నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత నభా న‌టేష్ ఓ భారీ ప్రాజెక్టుతో స్క్రీన్‌పై మెరుస్తున్నారు. సంయుక్త మీనన్ గోల్డెన్ లెగ్ సెంటిమెంట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తోంది. ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఇద్దరు భామల కెరీర్‌కు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా న‌భాన‌టేష్ కి ఈ సినిమా విజ‌యం అన్న‌ది అత్యంత కీల‌కం. ఇప్ప‌టికే అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటుంది.

`స్వ‌యంభు` రూపంలో అమ్మ‌డికిది కెరీర్ ట‌ర్నింగ్ అవ‌కాశం అనే చెప్పాలి. ఈ సినిమా ఫ‌లితం ఏమాత్రం అటు ఇటూ అయినా? టాలీవుడ్ లో మ‌రో ఛాన్స్ క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఇదే సమ్మర్ రేసులో అందరి దృష్టిని ఎక్కువగా ఆక‌ర్షిస్తుంది భాగ్యశ్రీ బోర్సే. అక్కినేని అఖిల్ హీరోగా న‌టిస్తోన్న `లెనిన్` చిత్రంలో అమ్మ‌డు హీరోయిన్‌గా నటిస్తోంది. భాగ్యశ్రీకి టాలీవుడ్‌లో ఇప్పటి వరకు సరైన కమర్షియల్ బ్రేక్ దక్కని సంగ‌తి తెలిసిందే. న‌టించిన సినిమాల‌న్నీ ప్లాప్ అవ్వ‌డంతో? కెరీర్ డైల‌మాలో ప‌డే ప‌రిస్థితికి వ‌చ్చేసింది. ఈ సినిమా హిట్ అయితేనే టాలీవుడ్‌లో

ఛాన్సులు రానున్నాయి. భాగ్య శ్రీ సైతం ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ వేసవి బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్ల యుద్ధమే కాదు. హీరోయిన్ల ఉనికి కోసం జరుగుతున్న పోరాటం కూడా. వీరిలో ఎవరు సమ్మర్ క్వీన్ గా నిలుస్తారో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News