నభా 'ఫ్యాషన్- కసి - పట్టుదల' చూడాలంతే
2022లో జరిగిన ఒక ఘోర కారు ప్రమాదం నభా కెరీర్ ను ఒక్కసారిగా నెమ్మదించేలా చేసింది. భుజానికి తీవ్రమైన గాయం కావడంతో పాటు పలు శస్త్రచికిత్సలు సుదీర్ఘ కోలుకునే ప్రక్రియ షూటింగ్ లకు దూరం చేశాయి.;
సినీ పరిశ్రమలో గ్లామర్, నటనతో పాటు అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఉన్న అతికొద్ది మంది హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న ఈ సుందరి గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నా.. ఇప్పుడు పూర్తి ఫిట్ నెస్ తో మళ్ళీ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ప్రమాదాలు మనిషిని శారీరకంగా దెబ్బతీసినా తనలోని కళాకారిణిని మాత్రం ఆపలేవని నభా నిరూపిస్తోంది
2022లో జరిగిన ఒక ఘోర కారు ప్రమాదం నభా కెరీర్ ను ఒక్కసారిగా నెమ్మదించేలా చేసింది. భుజానికి తీవ్రమైన గాయం కావడంతో పాటు పలు శస్త్రచికిత్సలు సుదీర్ఘ కోలుకునే ప్రక్రియ షూటింగ్ లకు దూరం చేశాయి. తోటి నటీనటులు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా తను మాత్రం ఎంతో ఓపికతో పట్టుదలతో తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మాస్ట్రో తర్వాత ఆమె నుంచి వస్తున్న సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే డార్లింగ్స్ తర్వాత నభా సినిమాల్లో నటిస్తున్నా అవి అంతకంతకు ఆలస్యమవుతున్నాయి. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం ఇస్తూ సినిమాలతో సమాధానం ఇవ్వబోతోంది. అంతకుముందే పూర్తి ఫిట్ నెస్ తో నభా సిద్ధమైంది
నృత్యం నటన నభా ప్రాణం
నభాకు నృత్యం నటన కేవలం వృత్తులు మాత్రమే కాదు.. అవి తన రెండు కళ్లు అని ఆమె చాటిచెబుతోంది. తాజాగా `నాగబంధం` సినిమాలోని నమో రే పాట `హుక్ స్టెప్` తో నభా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ పాటలో తన వేగవంతమైన కదలికలు గ్రేస్ చూస్తుంటే.. పాత నభాని మళ్ళీ చూస్తున్న అనుభూతి కలుగుతోంది. తన కంబ్యాక్ కోసం ఎంతగా శ్రమించిందో తన డాన్స్ చూస్తే అర్థమవుతుంది. అందుకే ఈ గ్రేట్ కంబ్యాక్ కి సినీ ప్రియులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
త్వరలో బాక్సాఫీస్ వద్ద సందడి
ప్రస్తుతం నభా నటేష్ రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. భారీ పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న `స్వయంభూ` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది దీంతో పాటు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న `నాగబంధం` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాల విడుదల తేదీలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఈ రెండు చిత్రాలు తన కెరీర్ లో మైలురాళ్లుగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఉగాది శుభాకాంక్షలు
గతంలోని చేదు జ్ఞాపకాలను చెరిపివేసి ఈ నూతన తెలుగు సంవత్సరం నభా నటేష్ కు అద్భుతమైన విజయాలను అందించాలని కోరుకుందాం. నటిగా డ్యాన్సర్ గా తన పూర్వ వైభవాన్ని సంతరించుకుని మరెన్నో హిట్లను తన ఖాతాలో వేసుకోవాలని ఆశిస్తూ `ఉగాది శుభాకాంక్షలు`