• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బెంగ‌ళూరు మురికివాడ‌ల‌పై...

బెంగ‌ళూరు మురికివాడ‌ల‌పై ఆస్కార్ బ‌రిలో తెలుగు-క‌న్న‌డ చిత్రం!

| దర్శకురాలు అనూయ స్వామి తెరకెక్కించిన కన్నడ-తెలుగు షార్ట్ ఫిల్మ్ ‘పంకజ’ 99వ ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచింది. బెంగళూరు మురికివాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గునీత్ మోంగా కపూర్ మద్దతు అందిస్తున్నారు. స్పైక్ లీ, విల్లెమ్ డఫో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తుండగా, ప్రస్తుతం సినిమా డిస్ట్రిబ్యూషన్ పనులు జరుగుతున్నాయి.

By - Sivaji Kontham
Update: 2026-11-28 13:30 GMT

ఆస్కార్ రేసులో `ఆర్.ఆర్.ఆర్` భారతదేశం నుంచి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పురస్కారం దక్కించుకున్న తర్వాత అకాడమీ అవార్డులపై భారతీయ సినీ వర్గాల్లో ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా 2026-2027 ఆస్కార్స్ కోసం `రామాయణ-1` విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో పోటీపడుతుండగా.. అదే సమయంలో నిర్మాత గునీత్ మోంగా కపూర్ మద్దతు ఉన్న లఘు చిత్రం `పంకజ` కూడా అంతే ఉత్కంఠను కలిగిస్తోంది. రెయిన్‌డ్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విజయం సాధించి జూన్‌లో 99వ అకాడమీ అవార్డ్స్‌కు అర్హత సాధించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దర్శకురాలు అనూయ స్వామి రూపొందించిన `పంకజ` కన్నడ-తెలుగు భాషల్లో తెరకెక్కి.. బెంగళూరు మురికివాడల నేపథ్యంలో సాగుతుంది. తప్పిపోయిన తన భర్త కోసం చిన్న కూతురితో కలిసి వెతికే తల్లి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన తల్లితో తనకున్న అనుబంధం.. రోజువారీ కూలీల మధ్య పెరిగిన వాతావరణం.. వ్యవస్థలో అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తుల తీరు నుంచే ఈ కథ పుట్టిందని అనూయ తెలిపారు. బెంగళూరు థియేటర్ నటి హర్షిని బోయల్ల టైటిల్ పాత్రలో నటించగా... బెంగళూరులో పెరిగిన ముగ్గురు తెలుగు అమ్మాయిలు కలిసి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం విశేషం.

ఈ సినిమా ప్రయాణంపై స్పందిస్తూ ప్రతిరోజూ నిద్రలేచాక ఏం జరుగుతోందో నమ్మలేకపోతున్నానని అనూయ స్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఎన్వైయూ టిష్ లో రెండో ఏడాది చదువుతున్నప్పుడు రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆస్కార్ క్యాంపెయిన్‌లో దూసుకెళ్తోంది. ఇందులో స్పైక్ లీ, విల్లెమ్ డఫో వంటి హాలీవుడ్ దిగ్గజాలతో పాటు ఆస్కార్ విజేత గునీత్ మోంగా కపూర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా తోడవడం సినిమా స్థాయిని పెంచింది.

ఒకప్పుడు దుప్పటి కప్పుకుని రహస్యంగా స్పైక్ లీ మాస్టర్‌క్లాస్‌లు చూసిన స్థాయి నుంచి..ఎన్‌వైయూలో ఆయనకు టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేసి.. ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం ఒక అద్భుతమైన మలుపులా అనిపిస్తోందని అనూయ పేర్కొన్నారు. ప్రస్తుతం `పంకజ` డిస్ట్రిబ్యూషన్ పనుల్లో బిజీగా ఉన్న ఈమె అణగారిన శ్రామిక వర్గాల ప్రేమ- పోరాటాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తూ ఆస్కార్ రేసులో తెలుగు -కన్నడ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు.

Tags:    
  • pankajafilm 
  • oscars2027 
  • guneetmonga 
  • indianfilms 
  • kannadacinema 

Similar News

'ఈతా' కోసం 12 కిలోల బరువు పెరిగిన శ్ర‌ద్ధా.. 8కేజీల గ‌జ్జెలు.. గాయాల‌తోనే!

2026-11-28 12:30 GMT

ఈ దర్శకులు ఇంకా అవే కథలను పట్టుకుంటున్నారా?

2026-11-28 11:30 GMT

చిరంజీవి అలాంటి కథ కోసం చూస్తున్నాడా?

2026-11-28 10:30 GMT

నాగ చైతన్య.. ఆ రిస్క్ వెనుక తండ్రి పోలికే!

2026-11-28 09:30 GMT

రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలంటే ఈ ఎలిమెంట్స్ ఉండాల్సిందే...

2026-11-28 08:30 GMT

ఆ ఫీలింగ్ వస్తేనే గెలిచినట్టు.. పార్ట్ 2 లపై కార్తీక్ దండు హింట్!

2026-11-28 08:07 GMT

నాగచైతన్య ఫేవరెట్ ట్రావెల్ స్పాట్స్.. ఆ ఐలాండ్ పేరు మాత్రం సీక్రెట్!

2026-11-28 08:04 GMT

ఇడుపు కాయితం: 'ఉల్లిపూల' అంటూ నాగదుర్గ రొమాంటిక్ అల్లరి

2026-11-28 08:03 GMT

కొరియోగ్రాఫ‌ర్ సుమ‌ల‌త క్షమాప‌ణలు.. జానీ మాస్ట‌ర్ కెరీర్ కోస‌మే!

2026-11-28 08:01 GMT

దేవకన్యలా కుర్రకారును మైమరపిస్తున్న టాలీవుడ్ బ్యూటీ!

2026-11-28 06:29 GMT

'రామాయణ'తో రకుల్‌కి కలిసి వచ్చింది ఎంత?

2026-11-28 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS