టాలీవుడ్ సీక్వెల్స్‌లో షాకింగ్ ట్విస్ట్‌లు!

టాలీవుడ్‌లో అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించి 2024, 2025లో విడుద‌లై క్రేజీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించాయో అంద‌రికి తెలిసిందే.;

Update: 2025-12-29 08:30 GMT

టాలీవుడ్‌లో అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించి 2024, 2025లో విడుద‌లై క్రేజీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించాయో అంద‌రికి తెలిసిందే. అయితే ఇప్పుడు వాటికి సీక్వెల్స్‌గా రానున్న సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కార‌ణం పార్ట్ 1లో న‌టించిన కీల‌క న‌టీన‌టులు పార్ట్ 2 నుంచి త‌ప్పుకోడ‌మే. ఈ విష‌యంలో ముందు వార్త‌ల్లో నిలిచిన మూవీ `క‌ల్కి 2898 ఏడీ`. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ అత్యంత భారీ స్థాయిలో రూపొదించిన మూవీ `క‌ల్కి 2898 ఏడీ`.

అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్‌, దీపికా ప‌దుకునే, దిషా ప‌టాని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శోభ‌న వంటి ప్ర‌ముఖ న‌టీన‌టులు న‌టించారు. ఎపిక్ సైన్స్ ఫిక్ష‌న్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టిచింది. కాశీ న‌గరం, శంబాల చుట్టూ అల్లుకున్న ఫిక్ష‌న‌ల్‌ స్టోరీకి అశ్వ‌ద్ధామ‌, మ‌హాభార‌త కురుక్షేత్ర యుద్దాన్ని లింక‌ప్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ సినిమా అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ మూవీని అసంపూర్తిగా ఎండ్ చేసిన మేక‌ర్స్ చివ‌ర్లో సీక్వెల్‌ని కూడా చేయ‌బోతున్నామ‌ని క్లారిటీ ఇచ్చారు.

అస‌లు క‌థ అంతా పార్ట్ 2లోనే ఉండ‌టంతో ఇప్పుడు అంద‌రి దృష్టి పార్ట్ 2పై ప‌డింది. అయితే త్వ‌ర‌లో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకోన్ ట్విస్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకోవ‌డం తెలిసిందే. క‌థ‌కు కీల‌క‌మైన క్యారెక్ట‌ర్‌లో న‌టించిన దీపిక ఇలా ట్విస్ట్ ఇవ్వ‌డంతో సీక్వెల్‌లో ఆ క్యారెక్ట‌ర్‌ని ఎవ‌రు చేస్తారు? ఏ క్రేజీ న‌టితో ఆమె పాత్ర‌ని ఫిల్ చేయ‌బోతున్నార‌న్న‌ది ఇప్పుడు ఇస‌క్తిక‌రంగా మారింది. ఇక 2024లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న `హ‌ను మాన్‌` సీక్వెల్‌ది మరో ట్విస్ట్‌.

తేజా స‌జ్జ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన `హ‌ను మాన్‌` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురి చేసింది. హీరోగా తేజ స‌జ్జ‌ని పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేర్చింది. దీనికి సీక్వెల్‌గా `జై హ‌నుమాన్‌`ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. అయితే ఇందులో తేజ స‌జ్జ మెయిన్ లీడ్‌గా కనిపించ‌డం లేదు. హ‌ను మాన్ క్యారెక్ట‌ర్ చుట్టే క‌థ సాగ‌నున్న నేప‌థ్యంలో ఆ క్యారెక్ట‌ర్ కోసం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ క‌న్న‌డ స్టార్ రిష‌బ్ శెట్టిని రంగంలోకి దించేస్తున్నాడు.

ఇక 2025లో విడుద‌లై పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన మూవీ `మిరాయ్‌`. తేజ స‌జ్జ హీరోగా న‌టించ‌గా, ఇందులో మంచు మ‌నోజ్ ప్ర‌ధాన విల‌న్‌గా బ్లాక్ స్వార్డ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి అద‌ర‌గొట్టాడు. సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని డైరెక్ట్ చేసిన ఈ మూవీకి కూడా త్వ‌ర‌లో సీక్వెల్ రాబోతోంది. అయితే ఇందులో మంచు మ‌నోజ్, త‌ను పోషించి బ్లాక్ స్వార్డ్ క్యారెక్ట‌ర్ క‌నిపించ‌ద‌ని తెలుస్తోంది. త‌న స్థానంలో సీక్వెల్ కోసం మ‌రో క్రేజీ స్టార్‌ని రంగంలోకి దించాల‌ని మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

ఇక ఇదే ఏడాది మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో రూపొంది బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించిన మూవీ `కొత్త లోక చాప్ట‌ర్ 1`. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, `ప్రేమ‌లు` ఫేమ్ న‌స్లెన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సైలెంట్‌గా విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించ‌ని విధంగా రూ.300 కోట్లు రాబ‌ట్టి అంద‌రిని ఆశ్య‌ర్య‌ప‌రిచింది. దుల్క‌ర్ స‌ల్మాన్ నిర్మించిన ఈ సినిమా తెలుగులోనూ విడుద‌లై అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ని చేస్తున్నారు. అయితే ఇందులో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ లీడ్ రోల్ కాకుండా టొవినో థామ‌స్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. దీంతో ఈ సీక్వెల్‌పై కూడా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇలా సీక్వెల్స్‌ల‌లో ప్ర‌ధాన క్యారెక్ట‌ర్లు ఔట్ కావ‌డంతో ఇవి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Tags:    

Similar News