టోన్డ్ బాడీతో పాలక్ బికినీ ట్రీట్!
పాలక్ తివారీ పరిచయం అవసరం లేదు. టీవీ నటి శ్వేతా తివారీ నటవారసురాలు. ఈ భామకు సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది.;
పాలక్ తివారీ పరిచయం అవసరం లేదు. టీవీ నటి శ్వేతా తివారీ నటవారసురాలు. ఈ భామకు సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా పాలక్ ని ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 48 లక్షల (4.8 మిలియన్ల)కు పైగా ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. ఈ బ్యూటీ ఇన్ స్టా ఫీడ్ నిరంతరం హీటెక్కిస్తూనే ఉంది.
ఇటీవల పాలక్ విదేశీ వెకేషన్ నుంచి వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. మారిషస్ బీచ్ లలో తన యాత్ర సాగుతోందని పాలక్ స్వయంగా వెల్లడించింది. మారిషస్ తీరంలో రకరకాల బీచ్‌వేర్‌లతో పాలక్ అగ్గి రాజేస్తోంది. ఇంతకుముందే తన తల్లి, నటి శ్వేతా తివారీతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేయగా అవి వెబ్ లో వైరల్ గా మారాయి. 40 ఏళ్ల శ్వేతా బికినీలో గుబులు పెంచింది. పాలక్ ఎరుపు - తెలుపు బికినీలో తన వంపులను ప్రదర్శిస్తూ కనిపించగా, శ్వేతా తివారీ నల్లని బీచ్‌వేర్‌లో అద్భుతంగా కనిపించింది. పాలక్ తో పోటీపడుతూ శ్వేతా అగ్గి రాజేస్తోందని అభిమానులు పొగిడేసారు.
ఇప్పుడు పాలక్ బికినీ బీచ్ ట్రీట్ సంథింగ్ స్పెషల్ గా వెబ్ లో దూసుకెళుతోంది. గులాబీ రంగు క్రోచెట్ ఓవర్‌లే టాప్ - మినీ స్కర్ట్ కాంబినేషన్‌తో వయోలెట్ బికినీ ధరించి బీచ్‌సైడ్ అందాలను ఆరబోసింది. ముఖ్యంగా టోన్డ్ బాడీతో పాలక్ గుబులు పెంచుతోంది. బికినీ బీచ్ ఫోటోతో పాటు ఇంతకుముందు తన గదిలోని మిర్రర్ సెల్ఫీ ఫోటోలను కూడా షేర్ చేసింది. ఈ ఫోటోషూట్ కి సింపుల్ క్యాప్షన్ ని కూడా ఇచ్చింది. ''PT ఇన్ మారిషస్ - ఆల్బమ్'' అని రాసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... పాలక్ `రోమియో S3` అనే చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చింది. అంతకుముందు సల్మాన్ భాయ్ కిసీ కా భాయ్ కిసీకి జాన్ చిత్రంలో నటించింది. భూత్నీ అనే హారర్ చిత్రంలోను పాలక్ నటించింది. కానీ ఇవేవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇటీవల పాలక్ యువహీరో ఇబ్రహీం అలీఖాన్ తో డేటింగ్ చేయడంపై తన తండ్రి స్పందిస్తూ, డేటింగ్ కంటే నటనపై దృష్టి సారించాలని సూచించారు.