• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుణ్ తేజ్ మూవీకి.. ఇది...

వరుణ్ తేజ్ మూవీకి.. ఇది పెద్ద ప్రమాదమే?

| టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్.. వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్

By - Tupaki Desk
Update: 2024-01-26 06:13 GMT

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్.. వరుస సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి ఆపరేషన్ వాలెంటైన్. పాన్ ఇండియా కథాంశంతో ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ కు నివాళులర్పిస్తూ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాజీ మిస్ యూనివర్స్‌ మానుషి చిల్లర్‌ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. శక్తి ప్రతాప్‌ సింగ్ హుడా డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్ గా కనిపించనుంది.

ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా.. ఫిబ్రవరి 16వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయితే గతేడాది డిసెంబర్ లో ఈ మూవీ విడుదల కావాల్సి ఉన్నా.. 2024 ఫిబ్రవరికి వాయిదా వేశారు. కానీ మళ్లీ ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నా.. అందులో నిజం లేదని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంపై వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఇది పక్కన పెడితే.. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఫైటర్ ఇటీవలే రిలీజై పాజిటివ్ అందుకుంటోంది. బ్లాక్ బస్టర్ పఠాన్ కు దీటుగా సిద్ధార్థ్ ఈ మూవీని తెరకెక్కించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ కు ఈ మూవీతో చిక్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ రెండు చిత్రాలు దాదాపు ఒకే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కాయి.

ఇప్పటికే ఫైటర్ ను తెలుగు సినీ ప్రియులు చాలా మంది చూసే ఉంటారు. దీంతో ఆపరేషన్ వాలంటైన్ రిలీజ్ అయ్యాక.. సోషల్ మీడియాలో ఈ రెండు చిత్రాల మధ్య కంపేరిజన్లు మొదలవుతాయి. అందుకే ఈ విషయంలో ఆపరేషన్ వాలంటైన్ మూవీ టీమ్ కాస్త కలవరపడుతోందట. మరోవైపు, హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. మరి ఫైటర్ మూవీ చూసిన నార్త్ ప్రేక్షకులు.. ఆపరేషన్ వాలంటైన్ ను ఎలా ఆదరిస్తారో చూడాలి.

ఇక వరుణ్.. పలాస 1978 ఫేమ్ కరుణ్ కుమార్ దర్శకత్వం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా మట్కాలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్ట్మైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పీరియాడిక్ బ్యాక్‌ డ్రాప్ స్టోరీతో ఈ మూవీ రాబోతుంది. మరి వరుస సినిమాలతో వరుణ్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Tags:    
  • Operationvalentine 
  • Varuntej 
  • Filmindustry 
  • Manushichhillar 
  • Operationvalentinemovie 
  • Fightermovie 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS