వార్ 2.. టైగ‌ర్ కంటే స్టైలిష్ బాడీ లాంగ్వేజ్?

హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న `వార్ 2` మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో అగ్ర‌స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-06 15:30 GMT

హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న `వార్ 2` మోస్ట్ అవైటెడ్ చిత్రాల జాబితాలో అగ్ర‌స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఒక సౌత్ సూప‌ర్ స్టార్ ఒక నార్త్ సూప‌ర్ స్టార్ క‌లయిక‌లోని ఈ చిత్రం క‌చ్ఛితంగా పాన్ ఇండియాలో వ‌సూళ్ల ప్ర‌వాహానికి బెస్ట్ ఫార్ములాగా భావిస్తున్నారు. హృతిక్ రోష‌న్ త‌న కెరీర్ లో తొలి 1000 కోట్ల క్ల‌బ్ ని అందుకునేందుకు ఆర్.ఆర్.ఆర్ స్టార్ ఎన్టీఆర్ చేరిక స‌హ‌క‌రిస్తుంద‌ని విశ్లేషిస్తున్నారు.

వార్ 2 గురించి ఏదో ఒక ఆస‌క్తిక‌ర వార్త వెలువ‌డుతూనే ఉంది. తార‌క్ ముంబైలో చిత్ర‌బృందంతో చేరిన‌ప్ప‌టి నుంచి చాలా లీకులు అందుతున్నాయి. ఇంత‌కుముందు హృతిక్, ఎన్టీఆర్ ల స్టైలిష్ లుక్స్ లీక‌య్యాయి. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్ట‌న్నింగ్ లుక్ తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తార‌ని తెలిసింది. అత‌డు 6 ప్యాక్ తో సాలిడ్ గా క‌నిపిస్తాడు. క‌థానాయ‌కుడు హృతిక్ ని ఢీకొట్టే స‌న్నివేశాల్లో అత‌డికి ధీటుగా క‌నిపిస్తాడ‌ని గుస‌గుస వినిపిస్తోంది.

Read more!

ఈ సినిమాలో పోరాట స‌న్నివేశాలు ఆర్టిఫిషియ‌ల్ గా క‌నిపించ‌వు. ప్ర‌తిదీ మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ తో ఎంతో నేచుర‌ల్ గా అల‌రిస్తాయి. పైగా తార‌క్ స్టంట్స్ ఎంతో స్టైలిష్ గా తీర్చిదిద్దుతున్నార‌ని తెలిసింది. వార్ 2లో ఎన్టీఆర్ లుక్ తో పాటు అత‌డి స్టైలిష్ ఫైట్స్ కూడా హైలైట్ గా నిలుస్తాయ‌ని సెట్స్ నుంచి లీకులందుతున్నాయి.

ఆస‌క్తిక‌రంగా బ్లాక్ బ‌స్ట‌ర్ వార్ చిత్రంలో హృతిక్ తో పాటు టైగ‌ర్ ష్రాఫ్ ఎంతో స్టైలిష్ గా క‌నిపించాడు. ఆ ఇద్ద‌రి న‌డుమా యాక్ష‌న్ బ్లాక్స్ కూడా అంతే గొప్ప‌గా అల‌రించాయి. హృతిక్ కి ధీటుగా 6 ప్యాక్ యాబ్స్ తో టైగ‌ర్ అబ్బుర‌ప‌రిచాడు. అయితే `వార్ 2` టీమ్‌లోకి ఎటైగ‌ర్ స్థానంలో చేరాడు కాబట్టి ఎన్టీఆర్ ఎలా క‌నిపిస్తాడో చూడాల‌న్న ఉత్కంఠ అంద‌రిలో పెరిగిపోతోంది. తారక్ లుక్, యాక్ష‌న్ విష‌యంలో ఎలా ఎలివేట్ అవుతున్నాడు? అన్న‌ది అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. వార్ 2 వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లోకి రానుంది.

Tags:    

Similar News