ఎన్టీఆర్ టాలీవుడ్ లో అయితే ఆ ఛాన్స్ తీసుకుంటాడా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `వార్ 2` తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తార‌క్ ప్ర‌తి నాయ‌కుడు పాత్ర పోషిస్తున్నాడు.;

Update: 2025-06-27 05:35 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ `వార్ 2` తో బాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో తార‌క్ ప్ర‌తి నాయ‌కుడు పాత్ర పోషిస్తున్నాడు. మొన్న‌టి వ‌ర‌కూ తార‌క్ పాత్ర పై ర‌క‌ర‌కాల సందేహాలుండేవి కానీ ప్ర‌చార చిత్రాల‌తో తార‌క్ బ‌ల‌మైన ప్ర‌తి నాయ‌కుడి పాత్ర పోషిస్తున్నాడు? అన్న సంగ‌తి అర్ద‌మైంది. హీరో పాత్ర‌కు ధీటుగా ఈ రోల్ హైలైట్ అవుతుంది. హీరో-విల‌న్ పాత్ర‌లు త‌గ్గాప్ వార్ గా తెర‌పై హైలైట్ కానున్నాయి.

తార‌క్ అలా విల‌న్ పాత్ర పోషించాడంటే క‌థలో అంద‌కు బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది. ఓస్టార్ హీరోని విల‌న్ గా చూపించారంటే? దానికి వెనుక బ‌ల‌మైన లాజిక్కులు క‌నిపిస్తాయి. మ‌రి ఆలాజిక్ ఎలా ఉంటుం ద‌న్న‌ది చూడాలి. అయితే ఇదే విల‌న్ పాత్ర టాలీవుడ్ లో వ‌స్తే తార‌క్ చేస్తాడా? అన్న ఓడౌట్ రెయిజ్ అవుతుంది.

ఓ స్టార్ హీరోతో ఓ స్టార్ డైరెక్ట‌ర్ సినిమా చేసి అందులో తార‌క్ ని విల‌న్ గా తీసుకుంటామంటే తార‌క్ అందుకు అంగీక‌రిస్తాడా? అన్న ఓ ఇంట్రెస్టింగ్ డౌట్ అభిమానుల్లో రెయిజ్ అయింది. మ‌రి అలాంటి ఆఫ‌ర్ వ‌స్తే తార‌క్ ఏమంటాడో చూడాలి. కానీ తార‌క్ అభిమానులు మాత్రం అందుకు ఎంత మాత్రం అంగీక‌రించారు. హీరోగా చూసిన తార‌క్ ను తెలుగు తెర‌పై విల‌న్ గా చూడ‌టానికి ఎంత మాత్రం ఇష్ట‌ప‌డ‌రు.

`ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో తార‌క్ రోల్ రామ్ చ‌ర‌ణ్ సీతారామ‌రాజు పాత్ర‌కు ధీటుగా లేద‌నే థియేట‌ర్లో త‌లుపులు బ‌ద్ద‌ల‌కొట్టి నానా హ‌డావుడి చేసారు. తార‌క్ రోల్ విష‌యంలో చాలా మంది అభిమానులు అసంతృప్తికి, నిరాశ‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిని కూడా విమ‌ర్శించారు. ఆ స‌మ యంలో తార‌క్ కూడా మౌనం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. దీంతో తార‌క్-రాజ‌మౌళి మ‌ధ్య దూరం పెరిగిందా? అన్న సందేహం కూడా వ్య‌క్త‌మైంది. కానీ తార‌క్ అభిమానుల తీరుపై గానీ, రాజ‌మౌళి వెళ్లిన విధానంపై గానీ ఏనాడు స్పందించ‌లేదు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు అంతా స‌ర్దుకుంది. అలాంటి తార‌క్ తెలుగు సినిమాలో విల‌న్ అంటే? ఛాన్స్ తీసుకోవ‌డం అత‌డికీ క‌ష్ట‌మే.

Tags:    

Similar News