డ్రాగన్ రెమ్యునరేషన్.. దద్దరిల్లిపోయేలా..?
ఐతే డ్రాగన్ సినిమా విషయంలో స్టార్ రెమ్యునరేషన్స్ కూడా భారీగా ఉన్నాయని తెలుస్తుంది.;
K.G.F సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి అసలు సిసలు మాస్ హీరో ఎన్టీఆర్ దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందో డ్రాగన్ తో తెలుస్తుందని అంటున్నారు. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా విషయంలో ప్రతి యాస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట.
మామూలుగానే హీరోల ఎలివేషన్ లో తన తర్వాతే ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ తో చేస్తున్నాడు కాబట్టి డ్రాగన్ సినిమాలో తారక్ ఎలివేషన్స్ కోసం ఫ్యాన్స్ మరో రెండు మూడు సార్లు చూసే ఛాన్స్ ఉంటుంది. ఐతే డ్రాగన్ సినిమా విషయంలో స్టార్ రెమ్యునరేషన్స్ కూడా భారీగా ఉన్నాయని తెలుస్తుంది.
ఎన్టీఆర్ ఎలాగు తన సినిమాకు రెమ్యునరేషన్ తో పాటుగా కొంత ప్రాఫిట్ షేర్ కూడా తీసుకుంటాడు. ఎప్పటిలానే ప్రాఫిట్ లో పాతిక శాతం షేర్ తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నారట. అది కుదరకపోతే ఒక ఏరియా ప్రాఫిట్ షేర్ అయినా ఇచ్చేలా డీల్ సెట్ చేసుకున్నారట. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఒక మూవీకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.
డ్రాగన్ సినిమాకు మాత్రం దానికి మించి డిమాండ్ చేశాడట. మైత్రి మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అన్నారట. సినిమాకు తన రెమ్యునరేషన్ కొంత ఫిక్స్ చేసి ఓవరాల్ ప్రాఫిట్ లో 50 శాతం దాకా అడిగాడట ప్రశాంత్ నీల్. ఐతే అది ఏ ఏరియా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా తను చేసే సినిమా.. తను పడే కష్టాన్ని బట్టే సినిమా అవుట్ పుట్ ఉంటుంది కాబట్టి ఎన్ టీ ఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా లెక్క ఒక రేంజ్ లో సెట్ చేసేలా ఉన్నారు.
ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాతో అమండు కూడా స్టార్ లీగ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. డ్రాగన్ సినిమా 2026 సమ్మర్ లేదా సెకండ్ హాఫ్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే కె.జి.ఎఫ్, సలార్ తరహాలో ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కూడా రెండు భాగాలు తీస్తాడా లేదా ఒక సినిమాతో ముగుస్తాడా అన్నది చూడాలి.