ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న డ్రాగన్..?
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ దాదాపు డ్రాగన్ అని ఫిక్స్ అయినట్టే.;
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ దాదాపు డ్రాగన్ అని ఫిక్స్ అయినట్టే. కె.జి.ఎఫ్ లాంటి క్రేజీ సినిమా తీసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ మొదటి పార్ట్ తీసి మాస్ ఫ్యాన్స్ ని మెప్పించాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఎన్ టీ ఆర్ తో చేస్తున్నాడంటే ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఐతే ఆ అంచనాలకు తగినట్టుగా కాదు కాదు అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్.
ఎన్టీఆర్ ప్రాణం పెట్టి చేస్తాడు ..
ఇప్పటివరకు జరిగిన డ్రాగన్ షూటింగ్ అంతా కూడా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ గా ఉన్నా ఎందుకో ఎన్టీఆర్ అంత సాటిస్ఫైడ్ గా లేడన్నట్టు టాక్. ఎన్టీఆర్ కి తన సినిమా పట్ల సెట్స్ మీద ఉనప్పటి నుంచే ఒక సెపరేట్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి చేస్తాడు కాబట్టే ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్లాడు. ఐతే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా విషయంలో కాస్త డౌట్ పడుతున్నాడట ఎన్టీఆర్.
అది మూవీ మేకింగ్ విషయంలోనా.. లేదా చెప్పిన కథ ఒకటైతే తీసేది వేరేలా ఉందా అన్నది తెలియదు కానీ ప్రశాంత్ నీల్ వర్క్ మీద తారక్ ఎందుకో కాస్త డిజప్పాయింటెడ్ గా ఉన్నాడట. సెట్స్ మీద ఉన్న సినిమా గురించి ఏదో ఒక గాసిప్ రావడం చాలా కమాన్. అదే తరహాలో డ్రాగన్ గురించి ఎవరో కావాలని ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారని అనుకోవచ్చు. డ్రాగన్ సినిమా అనౌన్స్ చేసి ఏడాది పైగా అయ్యింది.
డ్రాగన్ గురించి ఎలాంటి డౌట్ లు అక్కర్లేదు..
సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. ఇప్పటివరకు సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఐతే ప్రశాంత్ నీల్ మాత్రం ఎలాంటి డౌట్ లు అక్కర్లేదు సినిమాను తన బెస్ట్ మూవీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నానని అంటున్నాడట. ఎన్టీఆర్ తో ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఈ కాంబో 1000 కోట్లు కొల్లగొడుతుంది అనుకున్న ఫ్యాన్స్ కి సినిమాపై వస్తున్న ఈ రూమర్స్ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. మరి చిత్ర యూనిట్ ఈ విషయంలో అలర్ట్ అయ్యి ఫ్యాన్స్ కి సినిమాను ఎంగేజ్ చేసే ప్రమోషనల్ కంటెంట్ వదిలితే బాగుంటుందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తి చేసి దేవర 2 చేయాల్సి ఉంది. ఆ నెక్స్ట్ త్రివిక్రం తో సినిమా కూడా లైన్ లో ఉంది.