తమ్ముడు నితిన్.. ఆ ఒక్క ఛాన్స్..?

టాలీవుడ్ లో బ్యాడ్ లక్ ని తన వెంట పెట్టుకునే హీరో ఎవరైనా ఉన్నారంటే అది నితిన్ అనే చెప్పొచ్చు.;

Update: 2025-09-17 14:30 GMT

టాలీవుడ్ లో బ్యాడ్ లక్ ని తన వెంట పెట్టుకునే హీరో ఎవరైనా ఉన్నారంటే అది నితిన్ అనే చెప్పొచ్చు. హీరోగా పరిచయమై రెండు దశాబ్దాలు కావొస్తుంది. తనతో ఎంట్రీ ఇచ్చిన వాళ్లు స్టార్స్ అవగా తన తర్వాత వచ్చిన వాళ్లు కూడా అదరగొట్టేస్తున్నారు. కానీ నితిన్ మాత్రం ఇంకా ఆ లవర్ బోయ్ ఇమేజ్ తోనే కెరీర్ కొనసాగిస్తున్నాడు. కొన్ని ప్రయోగాలు అతను చేయడానికి ముందుకు రాకపోగా కొన్ని ప్రయత్నాలు చేసినా అవి వర్క్ అవుట్ కాలేదు. నితిన్ కెరీర్ ప్రస్తుతం చాలా రిస్క్ ఫేజ్ లో ఉందని చెప్పొచ్చు.

నితిన్ ప్రాజెక్ట్ లు హోల్డ్ లో..

తమ్ముడు సినిమా తర్వాత నితిన్ చేయాల్సిన ప్రాజెక్ట్ లు హోల్డ్ లో పడుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఈ పాటికే సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఎల్లమ్మ సినిమా నుంచి నితిన్ ని తప్పించారట. అఫీషియల్ గా చెప్పడమే తరువాయి అని టాక్. ఇక నితిన్ విక్రం కె కుమార్ తో ఒక సినిమా చేస్తడన్న టాక్ ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. లేటెస్ట్ గా నితిన్ హీరోగా ఒక కొత్త దర్శకుడితో సినిమా ఉంటుందని అంటున్నారు.

70 MM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందట. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ నిర్మాతలు ఇద్దరు కలిసి భలే మంచి రోజు, యాత్ర, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలు చేశారు. ఐతే కొద్దిపాటి గ్యాప్ తర్వాత మళ్లీ ఈ బ్యానర్ లో కొత్త సినిమా వస్తుందట. ఈ సినిమా నితిన్ కి సూటయ్యే పర్ఫెక్ట్ కథతో వస్తుందట. ఫ్లాపుల్లో ఉన్నా నితిన్ తో మళ్లీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తే వర్క్ అవుట్ అవుతుంది.

20 ఏళ్ల కెరీర్ లో..

కానీ రెండు అలాంటి సినిమాలు తీసి హిట్ పడగానే నితిన్ తో ప్రయోగం చేద్దాం అంటే మాత్రం రిస్క్ లో పడినట్టే. తమ్ముడు సినిమా నితిన్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నా అది డైరెక్టర్, హీరో కొలాబరేషన్ వల్ల ఏర్పడిన మిస్టేక్. దాని వల్ల నితిన్ కు నెక్స్ట్ రావాల్సిన ఎల్లమ్మ ఛాన్స్ మిస్ అయ్యింది.

ఐతే ఫ్లాపులొస్తే ఆగిపోయే టైపు కాదు నితిన్. 20 ఏళ్ల కెరీర్ లో హిట్లు కన్నా ఫ్లాపులే ఎక్కువ ఉంటాయి. దాదాపు 12, 13 సినిమాల దాకా వరుస ఫ్లాపులు పడ్డా కూడా నితిన్ ఎక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వలేదు. ఇప్పుడు కొత్త డైరెక్టర్ తో సినిమా కాబట్టి నితిన్ హిట్ కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News