మెగా డాటర్ కిర్రాక్ లుక్.. నెవ్వర్ బిఫోర్

లేటెస్ట్ గా నిహారిక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో మెగా డాటర్ వేరే లెవల్ లో ఉంది. డిజైన్ బ్లౌజ్, పింక్ కలర్ బాటమ్ తో అదరగొట్టింది.

Update: 2024-05-06 12:12 GMT

టాలీవుడ్ లో ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి ఎందరో హీరోలు వచ్చి అలరిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నిహారిక కొణిదెల మాత్రమే. కొన్ని నెలల క్రితం.. తన భర్తతో డివోర్స్ తీసుకున్న ఆమె.. ఇప్పుడు కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ఇండస్ట్రీలో మెల్లమెల్లగా బిజీ అవుతోంది. నటిస్తూనే నిర్మిస్తోంది కూడా.

 

ప్రస్తుతం నిహారిక కొణిదెల.. కోలీవుడ్, టాలీవుడ్ లో చెరో సినిమా చేస్తోంది. తమిళంలో 'మద్రాస్ కరన్' మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో 'వాట్ ది ఫిష్' చిత్రంలో యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ రెండు మూవీల షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఓటీటీ ఆహాలో కూడా సందడి చేస్తోంది. చెఫ్ మంత్ర సీజన్-3కి హోస్ట్ గా వ్యవహరిస్తోంది మెగా డాటర్ నిహారిక.

సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది నిహారిక. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటోంది. ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తుంటోంది. అలా ఫ్యాన్స్ తో డైలీ టచ్ లో ఉంటోంది. క్రేజీ ఔట్ ఫిట్స్ లో అందాలు ఆరబోస్తుంటోంది. పొట్టి డ్రెస్సులతో పాటు చీరల్లో కూడా గ్లామర్ షో చేస్తుంటోంది. తన నవ్వుతో కుర్రకారు మతులు పోగుడుతుంటోంది. నెట్టింట ఫాలోవర్లను కూడా పెంచుకుంటోంది.

లేటెస్ట్ గా నిహారిక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో మెగా డాటర్ వేరే లెవల్ లో ఉంది. డిజైన్ బ్లౌజ్, పింక్ కలర్ బాటమ్ తో అదరగొట్టింది. వయ్యారంగా నిల్చుని ఫిదా చేస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. తన ఇన్నోసెంట్ చూపుతో మాయ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిహారిక ఫోటో అదిరిపోయిందని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం మార్ఫింగ్ పిక్ లా ఉందని చెబుతున్నారు.

ఇక.. నిహారిక సొంత బ్యానర్ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' పై రూపొందుతున్న ఫస్ట్ మూవీ 'కమిటీ కుర్రోళ్ళు' షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప‌క్కా ప్లానింగ్‌ తో మేక‌ర్స్ అనుకున్న స‌మ‌యానికి క‌న్నా ముందే ఈ సినిమా షూటింగ్‌ ను పూర్తి చేశారు. ఈ మూవీతో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మరి ఈ చిత్రంతో నిహారిక ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News