వీరమల్లు సీక్వెల్ షురూ- షూటింగ్ ఎంత వరకు జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో 10 రోజుల్లో హరి హర వీర మల్లు సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు.;

Update: 2025-07-16 01:45 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో 10 రోజుల్లో హరి హర వీర మల్లు సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 24న రిలీజ్ కానుంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.

స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ టైటిల్ తో రానున్న తొలి భాగంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అదే క్రమంలో అభిమానులు రెండో పార్ట్ పై కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ నిధి అగర్వాల్ రెండో భాగంపై ఇటీవలే అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఓ క్లారిటీ వచ్చింది.

అయితే రెండో భాగం షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభమైందట. 20 నిమిషాల స్క్రీన్ టైమ్ చిత్రీకరణ పూర్తైందట. అలాగే ఇంకా చాలా భాగం షూట్ చేయాల్సి ఉందని చెప్పారు. దీంతో తొలి పార్ట్ ఫలితం ఎలా ఉన్నా, రెండో భాగం కూడా కచ్చితంగా వస్తుందనన్న నమ్మకం ఫ్యాన్స్ లో కలిగింది. ఇక పలుమార్లు వాయిదా పడినా, ఎట్టకేలకు తొలి భాగం షూటింగ్ పూర్తి చేసిన పవన్, సీక్వెల్ కు ఎన్ని రోజులు డేట్స్ కేటాయిస్తారోనని ఆసక్తి నెలకొంది.

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి యాక్షన్ అవతార్ లో కనిపించనుండడం అభిమానులకు ఇది ఫుల్ మీల్స్ సినిమా కానుంది. ఇందులో యాక్షన్ సీన్స్ కు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే నెగెటివ్ రోల్ లో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కనిపించనున్నారు. క్లైమాక్స్ లో ఆయనతో పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయట. ఈ సన్నివేశానికి థియేటర్లు దద్దరిల్లాల్సిందేనట.

కాగా, బ్యూటీఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ యువ రాణి పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, నాజర్, సత్యరాజ్, దిలీప్ తహిల్, తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకున్నారు. కీరవాణి మ్యూజిక్ అందించారు.

Tags:    

Similar News