మంచు లక్ష్మి ఇంట స్పెషల్ ఈవెంట్.. కూతురు ఎంత క్యూట్ గా ఉందో!

టాలీవుడ్ ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఇంట సందడి వాతావరణం నెలకొంది.;

Update: 2026-03-18 04:02 GMT

టాలీవుడ్ ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఆమె ఏకైక కుమార్తె విద్యా నిర్వాణ ఓణీ వేడుక (హాఫ్ శారీ ఫంక్షన్) హైదరాబాద్‌ లోని ఓ ప్రముఖ రిసార్టులో మార్చి 15న గ్రాండ్ గా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి.




 


ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో విద్యా నిర్వాణ ఎంతో అందంగా, ముద్దుగా కనిపించిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వేడుకను పూర్తిగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల మధ్య నిర్వహించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఆ కార్యక్రమం మంచు కుటుంబానికి ప్రత్యేక గుర్తుగా నిలిచిందని చెప్పొచ్చు.




 


ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన హ్యాపీ నెస్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నా కుమార్తె ఆశీర్వాద వేడుక ఇది. ఈ అందమైన వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన నా డ్రీమ్ టీమ్‌ కు కృతజ్ఞతలు” అని ఆమె పేర్కొన్నారు. దక్షిణ భారత సంప్రదాయంలో అమ్మాయిలు యుక్త వయసులోకి అడుగుపెట్టిన సందర్భంగా ఓణీ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. అదే సంప్రదాయాన్ని మంచు కుటుంబం ఇప్పుడు ఫాలో అయింది.




 


కలెక్షన్ కింగ్‌ మంచు మోహన్ బాబు మనవరాలు అయిన విద్యా నిర్వాణకు ఆ వేడుకను అత్యంత ఘనంగా జరిపినట్లు ఫోటోల ద్వారా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులందరూ కలిసి పాల్గొని ఆ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. చిన్నప్పటి నుంచి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే విద్యా నిర్వాణ, ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.




 


అయితే విద్యా నిర్వాణ ఫారిన్ లో చదువుకుంటూ తన ప్రతిభను చాటుకుంటోంది. చిన్న వయసులోనే చెస్ ట్రైనర్‌ గా గుర్తింపు పొందడం విశేషం. సినీ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఇప్పటివరకు సినిమాల్లో నటించకపోవడం గమనార్హం. భవిష్యత్తులో ఆమె కూడా నటిగా ఎంట్రీ ఇస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మంచు లక్ష్మి గతంతో పోలిస్తే ఇటీవల సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా ఆమె సందడి తగ్గింది.

ప్రస్తుతం ఎక్కువ సమయం ముంబైలో గడుపుతూ, అవసరమైనప్పుడు మాత్రమే హైదరాబాద్‌ కు వస్తున్నట్లు సమాచారం. గత ఏడాది లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన దక్ష సినిమాలో నటించిన ఆమె, ఈ ఏడాది బూకీ అనే తమిళ–తెలుగు ద్విభాషా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మంచు కుటుంబంలో జరిగిన విద్యా ఓణీ వేడుక ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వేడుకకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

Tags:    

Similar News