అక్షయ్ ఖన్నా గెస్ట్ రోల్‌కే అంత తీసుకున్నాడా?
అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రికార్డుల మోత మొదలు పెట్టింది. కేవలం అడ్వాన్స్ సేల్స్ ద్వారానే వంద కోట్ల మార్కుని దాటడం ట్రేడ్ వర్గాలని షాక్ కు గురి చేస్తోంది.;
బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన మూవీ `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మౌత్ టాక్‌తో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. దీంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న `ధురంధర్ 2`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇండియన్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సినీ లవర్స్ నుంచి సెలబ్రీటీలు సైతం ఎదురు చూస్తున్న ఈ సినిమా మార్చి 19న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రికార్డుల మోత మొదలు పెట్టింది. కేవలం అడ్వాన్స్ సేల్స్ ద్వారానే వంద కోట్ల మార్కుని దాటడం ట్రేడ్ వర్గాలని షాక్ కు గురి చేస్తోంది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రికార్డులు సృష్టిస్తే రేపు రిలీజ్ తరువాత ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో అంచనా వేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ ప్రధాన హైలైట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్యారెక్టర్ ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం అక్షయ్ ఖన్నా స్వాగ్. తను క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసి రక్తికట్టించాడా? అనేంతగా రెహమాన్ క్యారెక్టర్‌ని పోషించి అందరిని షాక్‌కు గురి చేశారు.
మార్చి 19న రిలీజ్ అవుతున్న సీక్వెల్ లోనూ రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ ఉంటుందట. అయితే అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వస్తుందని, క్యారెక్టర్ నిడివి కూడా చాలా తక్కువేనని తెలిసింది. ఇంత చిన్న గెస్ట్ రోల్ పోషించడానికి అక్షయ్ ఖన్నా రూ.2.5 కోట్లు ఛార్జ్ చేశాడని తెలిసింది. `ధురంధర్` బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే అది అక్షయ్ ఖన్నా క్యారెక్ట్ వల్లే. రణ్‌వీర్ సింగ్‌కి మించి ఫస్ట్ పార్ట్‌లో అక్షయ్ ఖన్నాదే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసిన వాళ్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు.
దీంతో ఆయన సెకండ్ పార్ట్ కోసం భారీగా డిమాండ్ చేసే అవకాశం ఉంటుందనే చర్చ జరిగింది. దానికి తగ్గట్టే అక్షయ్ ఖన్నా చిన్న గెస్ట్ రోల్ కోసం ఏకంగా 2.5 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేయడం ఆయనకు పెరిగిన క్రేజ్‌కు నిదర్శనమని తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్ కోసం రణ్ వీర్ సింగ్ పారితోషికం కింద రూ.50 కోట్లు తీసుకున్నాడట. సంజయ్ దత్ రూ.10 కోట్లు తీసుకున్నారట. ఫస్ట్ పార్ట్‌లోనూ సంజయ్ దత్ క్యారెక్టర్‌కు మంచి ప్రాధాన్యత ఉండటం, సెకండ్ పార్ట్‌లోనూ అంతకు మించి క్యారెక్టర్ నిడివి ఉండటంతో సంజయ్ దత్ సీక్వెల్‌కు రూ.10 కోట్లు డిమాండ్ చేశారట.
అర్జున్ రాంపల్ రూ.కోటి తీసుకోగా సారా అర్జున్ కూడా అంతే సరిపెట్టుకుందని తెలిసింది. అయితే మ్యాడీ..మాధవన్ మాత్రం రూ.9 కోట్లు డిమాండ్ చేశాడట. ఇందులో మాధవన్ షో రన్నర్‌గా అజిత్ ధోవల్ క్యారెక్టర్‌లో కీలక పాత్ర చేయడం, సెకండ్ పార్ట్‌లోనూ అధిక ప్రాధాన్యత ఉండటంతో మాధవన్‌కు రూ.9 కోట్లు పారితోషికం ఇచ్చినట్టుగా తెలిసింది. సీక్వెల్ కు సంబందించిన అత్యంత తక్కువ పారితోషిం తీసుకుంది మాత్రం ఇద్దరే ఇద్దరు ఒకరు అర్జున్ రాంపల్, మరొకరు సారా అర్జున్. వీరిద్దరు చెరో కోటితో సరిపెట్టుకున్నారు.