సినిమాల్లేకున్నా బ్రాండ్ల‌తో వాణీ జోష్.. ఒక్కో పోస్టుకు ఆదాయం త‌గ్గేదేలే!

ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్లకు ప్రమోషన్లు కల్పించడం కోసం భారీగా వసూలు చేస్తోంది.

Update: 2026-06-25 18:41 GMT

బాలీవుడ్ యాక్షన్ చిత్రం `వార్`లో తన గ్లామర్‌తో మెప్పించిన బ్యూటీ వాణీ కపూర్ నటన కెరీర్ ప్రస్తుతం పెద్దగా ఆశించినంత జోష్‌తో సాగడం లేదు. వెండితెరపై ఈ బ్యూటీకి పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా..త‌న‌ క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో పెద్దగా కనిపించనంత మాత్రాన కెరీర్ పరంగా వెనుకబడిపోవాల్సిన అవసరం లేదని వాణీ కపూర్ నిరూపిస్తోంది. ప్రస్తుతం ఈ భామ‌ సినిమా అవకాశాల కంటే కూడా వాణిజ్య ప్రకటనలు -బ్రాండ్ ఎండార్స్‌మెంట్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టి వాటి ద్వారానే భారీగా ఆదాయం ఆర్జిస్తోంది.

 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వాణీ కపూర్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్‌ను తెలివిగా క్యాష్ చేసుకుంటోంది. ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్లకు ప్రమోషన్లు కల్పించడం కోసం భారీగా వసూలు చేస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.... వాణీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్ ఇన్‌స్టాలో చేసే ఒక్కో పెయిడ్ పార్టనర్‌షిప్ పోస్టుకు లక్షల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటారు. ఇక ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్లతో ఏడాది కాంట్రాక్టుపై సంతకం చేస్తే... ఆ బ్రాండ్ అంబాసిడర్ ఫీజు రూపంలో కోట్లాది రూపాయలను వసూలు చేస్తోంది.

వాణీ కపూర్ కేవలం దుస్తులు లేదా మేకప్ ఉత్పత్తులకే కాకుండా విభిన్న రకాల లైఫ్‌స్టైల్ బ్రాండ్లకు ప్రమోషన్ కల్పిస్తోంది. ఇటీవల ఆమె `లుక్సన్ అఫీషియల్` అనే ప్రముఖ ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్‌తో పెయిడ్ పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. ఈ బ్రాండ్‌కు సంబంధించిన సరికొత్త మేకప్ స్టైలింగ్ - జ్యువెలరీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేకమైన వీడియో పోస్ట్‌ను షేర్ చేసింది.

 

ముఖ్యంగా వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా తన అభిమానులను ఆకట్టుకునేలా వాణీ ఈ ప్రమోషన్ నిర్వహించింది. ప్రేమ అనేది చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లలోనే దాగి ఉంటుంది.. .. ఈ వాలెంటైన్స్‌కు కేవలం అందమైనది మాత్రమే కాదు.. ఎంతో అర్థవంతమైన జ్యువెలరీని బహుమతిగా ఇవ్వండి! అంటూ ల్యాబ్-గ్రోన్ డైమండ్స్ ప్రాధాన్యతను వాణీ వివరించింది. ప్రతిరోజూ ధరించడానికి, జీవితాంతం ప్రేమించడానికి వీలుగా ఉండే ఈ జ్యువెలరీని ఆమె తన పోస్ట్‌లో ప్రమోట్ చేసింది. వాణీ కపూర్ చేసిన ఈ గ్లామరస్ అండ్ కమర్షియల్ పోస్ట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానుల నుండి లైకులు.. హార్ట్ ఎమోజీలతో కూడిన కామెంట్ల రూపంలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది. సినిమాల్లో జోష్ తగ్గినా, బ్రాండ్ల పరంగా వాణీ కపూర్ సంపాదన మాత్రం టాప్ గేర్‌లో దూసుకుపోతోందని చెప్పవచ్చు.

 

బాలీవుడ్ స్టార్ బ్యూటీ వాణీ కపూర్ కేవలం కమర్షియల్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సోషల్ మీడియా ప్రమోషన్లతోనే కాకుండా సినిమాల పరంగానూ సరికొత్త ప్లానింగ్‌తో ముందుకు సాగుతోంది. వెండితెరపై కొంతకాలంగా పెద్దగా జోష్ కనిపించక‌పోయినా.. ప్రస్తుతం త‌న‌ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం వాణీ కపూర్ నటిస్తున్న ప్రాజెక్టులలో సర్వగుణ్ సంపన్ చిత్రం ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వాణీ కపూర్ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా ద్వారా ఆమె తన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.

దీనితో పాటు వాణీ నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం బద్తమీజ్ గిల్ . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రక్రియ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్ పాత్ర ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా... గ్లామరస్‌గా ఉండబోతోందని టాక్. ఈ సినిమాపై కూడా హిందీ పరిశ్రమలో మంచి అంచనాలే ఉన్నాయి.

వరుసగా సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటూనే, మరోవైపు కార్పొరేట్ బ్రాండ్స్ ప్రమోషన్లతో వాణీ కపూర్ తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో షూటింగ్స్ జరుపుకుంటున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, వాణీ కపూర్ సినీ కెరీర్ మళ్లీ ఫుల్ జోష్‌లోకి రావడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News