రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పక్కన టాలీవుడ్ ఎక్స్‌ప్రెస్!
| టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీకి దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అనుకోకుండా ఎదురయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగారు. ఆ ఫొటోను బ్రహ్మాజీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షోయబ్‌ను టాలీవుడ్‌లో విలన్‌గా చూడాలంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ పాపులర్ నటుడు బ్రహ్మాజీ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తో కలిసి దిగిన సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని లాంజ్‌లో వీరిద్దరూ అనుకోకుండా ఎదురుపడగా ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫోటోను బ్రహ్మాజీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఈ సెల్ఫీలో షోయబ్ అక్తర్ బ్లాక్ టీ-షర్ట్‌లో కనిపించగా.. బ్రహ్మాజీ నేవీ బ్లూ జాకెట్‌లో చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకున్నారు. ఈ పోస్ట్ బయటకు వచ్చిన కొద్దిసేపట్లోనే నెటిజన్ల నుంచి వేలాది లైక్స్.. ఆసక్తికర కామెంట్లతో దూసుకుపోతోంది.
ఈ ఫోటోపై సినీ, క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో సరదా కామెంట్లతో సందడి చేస్తున్నారు. షోయబ్‌ను ఎలాగైనా టాలీవుడ్‌లోకి తీసుకొచ్చి మంచి విలన్‌గా సెటిల్ చేద్దాం మామా! అంటూ కొందరు నెటిజన్లు సరదాగా వ్యాఖ్యానించగా.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పక్కన టాలీవుడ్ ఎక్స్‌ప్రెస్! అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ స్పెషల్ సెల్ఫీపై కొందరు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినా.. రెండు విభిన్న రంగాల ప్రముఖులు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.
క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకరిగా పేరుగాంచిన పాక్ ఫేసర్ షోయబ్ అక్తర్ గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు సంధించి రికార్డులు నెలకొల్పారు. పాకిస్థాన్ తరఫున 46 టెస్టులు, 163 వన్డేలు ఆడి మొత్తం 425 వికెట్లు పడగొట్టిన అక్తర్ రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ విశ్లేషకుడిగా- యూట్యూబర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ పాత్రలు, ప్రత్యేక కామెడీ టైమింగ్‌తో బ్రహ్మాజీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ అనుకోని భేటీ ఆ తర్వాత బ్రహ్మాజీ షేర్ చేసిన సెల్ఫీ ఇప్పుడు టాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచాయి. విభిన్న రంగాలకు చెందిన ఇద్దరు ఆసక్తికర వ్యక్తులు ఒకే చోట కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అన్నట్టు షోయబ్ తనంతట తానుగా భారతీయ సినీ పరిశ్రమలో నటించాలని భావించినా ప్రస్తుత సన్నివేశంలో అతడికి ఆ అవకాశం లేదు. పాక్ నటీనటులపై బ్యాన్ కొనసాగుతోంది. కెరీర్ పరంగా చూస్తే.. ప్రస్తుతం బ్రహ్మాజీ తన సుదీర్ఘ అనుభవాన్ని ఉపయోగించి నటించిన ప్రతి సినిమాకి ప్లస్ గా మారుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.