• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సినిమాయేనా.. వెబ్ సిరీసా?...

సినిమాయేనా.. వెబ్ సిరీసా? స‌మంత రీఎంట్రీ ట్విస్ట్!

| సమంత రీఎంట్రీ ‘అభిమన్యు 2’తో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ సీక్వెల్ కోసం ఆమెను సంప్రదించగా, సమంత సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్, సోనీ లివ్ తమిళ ప్రాజెక్ట్ కూడా ఆమె తదుపరి ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By - Sivaji Kontham
Update: 2026-11-29 08:30 GMT

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మాతృత్వపు మధురిమలను ఆస్వాధిస్తూ ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్నారు. నవంబర్ 19న భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తమ కుమారుడు దేవ్ నిడిమోరుకు జన్మనిచ్చిన సమంత తదుపరి ఏ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తారన్నది ఇప్పుడు దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్‌గా మారింది.

అయితే తాజా సమాచారం ప్రకారం.. విశాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం `అభిమన్యు` (ఇరుంబు తిరై) సీక్వెల్ కోసం దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఇప్పటికే సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సమంత కూడా సానుకూలంగా స్పందించి ఓకే చెప్పారనే గుసగుసలు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటంతో సామ్ రీఎంట్రీ మూవీ ఇదే అవుతుందా అన్న చర్చ వేడెక్కిస్తోంది. అయితే దీనిపై స‌మంత కాంపౌండ్ అధికారికంగా ఎలాంటి స‌మాచారాన్ని రివీల్ చేయ‌లేదు.

మరోవైపు సమంత తదుపరి చిత్రాల జాబితాను పరిశీలిస్తే.. `అభిమన్యు 2`తో పాటు రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న భారీ ఫాంటసీ-యాక్షన్ వెబ్ సిరీస్ `రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్` కూడా రేసులో బలంగా వినిపిస్తోంది. మెటర్నిటీ బ్రేక్ ప్రకటించడానికి ముందే స‌మంత‌ ఈ సిరీస్‌లో న‌టించారు. అంతేకాకుండా జూలై 2026లో తన విరామాన్ని ప్రకటించిన కొద్దిరోజులకే ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ తో ఒక తమిళ ప్రాజెక్ట్ ఉండబోతోందని సమంత స్వయంగా హింట్ ఇచ్చారు. దీంతో థియేట్రికల్ రిలీజ్ పరంగా `అభిమన్యు` సీక్వెల్ ముందుంటుందా లేక డిజిటల్ తెరపై `రక్త్ బ్రహ్మాండ్` లేదా తమిళ ఓటీటీ సిరీస్‌తో ముందుగా సందడి చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.

జూన్ 2026లో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన `మా ఇంటి బంగారం` సక్సెస్ మీట్ సందర్భంగా సమంత తన రీఎంట్రీ ప్రణాళికలపై స్పష్టతనిచ్చే ప్ర‌య‌త్నం చేసారు. తన పునరాగమనానికి ఎలాంటి కచ్చితమైన డెడ్‌లైన్ పెట్టుకోవడం లేదని.. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాధించిన తర్వాతే ఏదైనా ఒక భారీ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్‌తో తిరిగి వస్తానని పేర్కొన్నారు. అందుకే కథాబలం, తన పాత్రకు ఉండే ప్రాముఖ్యతను బేరీజు వేసుకున్నాకే సమంత షూటింగ్ సెట్స్‌పైకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

అభిమ‌న్యు తొలి భాగంలో తన నటనతో మెప్పించిన స‌మంత ఇప్పుడు సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అటు భారీ బడ్జెట్ ఫాంటసీ సిరీస్ `రక్త్ బ్రహ్మాండ్` కూడా రేసులో ఉంది. వీట‌న్నిటి పోటీ న‌డుమా ఏది ముందు వ‌రుస‌లో ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తుంది? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    
  • samantharuthprabhu 
  • abhimanyudu2 
  • vishal 
  • samanthacomeback 
  • tollywood 

Similar News

ప్రేమను నిలబెట్టే విధ్వంసం.. 'నీరో' గ్లింప్స్ పై ప్రముఖుల ప్రశంసలు!

2026-11-29 07:39 GMT

బాలయ్యకు ఎలా సాధ్యం అవుతోంది?

2026-11-29 07:30 GMT

రెండో వారంలో 'ఆకాశంలో ఒక తార' మెరిసేది ఎంత?

2026-11-29 07:07 GMT

Bigg Boss Telugu 10: కెప్టెన్ అమన్ & ముఖేష్‌లకు గట్టి వార్నింగ్!

2026-11-29 07:06 GMT

వెంకీ అట్లూరి న‌ట‌న మానేసి ద‌ర్శ‌క‌త్వంలోకి.. ఈ హీరోనే కార‌ణం!

2026-11-29 07:06 GMT

Bigg Boss Telugu 10: 12వ వారం డబుల్ ఎలిమినేషన్ షాక్!

2026-11-29 07:05 GMT

వృషకర్మ’ ఆరంభమే అదిరిపోతుంది.. కార్తిక్ దండు క్రేజీ కామెంట్స్!

2026-11-29 07:05 GMT

ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్ చూసే అవకాశం!

2026-11-29 06:10 GMT

ప‌ల్లవి ది గ్రేట్: ఔత్సాహిక న‌టీన‌టుల‌కు గొప్ప‌ మౌన‌ పాఠం!

2026-11-29 06:10 GMT

అల్లు (Vs) సుక్కూ: ఐకాన్‌స్టార్‌తో `పుష్ప‌-3` ఛాలెంజ్‌ని స్వీక‌రిస్తారా?

2026-11-29 05:29 GMT

అదిరిపోయే లుక్‌లో శివాని నాగారం.. ఫ్యాన్స్ ఫిదా!

2026-11-29 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS