వృషకర్మ’ ఆరంభమే అదిరిపోతుంది.. కార్తిక్ దండు క్రేజీ కామెంట్స్!
| నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘వృషకర్మ’ డిసెంబర్ 4న విడుదల కానుంది. సినిమా మొదటి పది నిమిషాలు మిస్ కావొద్దని దర్శకుడు కార్తీక్ దండు సూచించారు. మీనాక్షి పాత్ర చుట్టూ కీలక ట్విస్ట్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అర్జున్‌గా నటించిన చైతన్య, ఈ సినిమా తన కంఫర్ట్ జోన్‌కు భిన్నమైన ప్రయోగమని తెలిపాడు.
నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జోడీగా వస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’పై ఇప్పుడు మంచి బజ్ నడుస్తోంది. డిసెంబర్ 4న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ కార్తీక్ దండు పెట్టిన ఒక రిక్వెస్ట్ ఆసక్తి రేపుతోంది. సినిమా మొదలైన మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ కావద్దని ఆయన గట్టిగా చెబుతున్నారు. అసలు ఆ ఫస్ట్ టెన్ మినిట్స్‌లో ఏం దాగుంది, డైరక్టర్, ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
మొదటి పది నిమిషాల ట్విస్ట్ ఏంటి?:
చాలామంది సినిమా స్టార్ట్ అయ్యాక పాప్‌కార్న్ పట్టుకుని లేట్‌గా సీట్లలో కూర్చుంటుంటారు. కానీ ‘వృషకర్మ’ విషయంలో అలా చేస్తే కథలో కనెక్షన్ మిస్ అవుతుందని కార్తీక్ దండు అంటున్నారు. ఇక ఆరంభంలోనే కథలోకి లాగే సీన్లు, ఒక కీలకమైన ఫ్లో సెట్ అవుతుందట. అందుకే టైమ్‌కు థియేటర్‌కు వెళ్లి కూర్చోవడం చాలా ముఖ్యం.
హీరోయిన్ క్యారెక్టర్ చుట్టూ పెద్ద మలుపు:
‘విరూపాక్ష’ చూసిన వాళ్లకు అందులో హీరోయిన్ పాత్రకు ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘వృషకర్మ’లో కూడా మీనాక్షి చౌదరి క్యారెక్టర్ చుట్టూ అలాంటి పెద్ద ట్విస్ట్ ఒకటి ఉందని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా, ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీగానే తెరకెక్కింది.
కంఫర్ట్ జోన్ దాటి చేసిన కొత్త ప్రయోగం:
తన సినీ ప్రయాణంలో ఎప్పటినుంచో కోరుకుంటున్న లార్జ్‌స్కేల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాతో నెరవేరిందని చైతూ చెబుతున్నాడు. ఎప్పుడూ చేసే రెగ్యులర్ కథలకు భిన్నంగా, కంఫర్ట్ జోన్ దాటి ఈ సినిమా చేశాడట.ఇక ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఓకే చేశానని అన్నాడు.
కథ, విజువల్స్ కలిస్తే వేరే లెవల్ అనుభూతి:
ఇందులో తను చేసిన అర్జున్ పాత్ర విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ స్కోప్ ఉన్నది కావడంతో, నటుడిగా మెంటల్‌గా కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించిందట. పెద్ద తెరపై చూసినప్పుడు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ కలగాలనేదే తమ ప్లాన్ అంటున్నారు. ఇక కథ, విజువల్స్, స్క్రీన్‌ప్లే అన్నీ కలిసి సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయని టీమ్ నమ్మకంగా ఉంది.
డిసెంబర్ 4న అసలు వేట:
మిస్టరీ, థ్రిల్, విజువల్ ఎఫెక్ట్స్ కలగలిపి కార్తీక్ దండు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడు. మొదటి పది నిమిషాల్లోనే గ్రిప్ దొరికితే, సినిమా మొత్తం ఎలా సాగుతుందో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 4న థియేటర్లలో అసలు సంగతి తెలుస్తుంది.