Bigg Boss Telugu 10: 12వ వారం డబుల్ ఎలిమినేషన్ షాక్!
| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉత్కంఠ రేపుతోంది. తక్కువ ఓటింగ్‌తో టెంపర్ వంశీ శనివారం ఎలిమినేట్ అయినట్లు సమాచారం. మరోవైపు వర్షిణి సౌందరరాజన్ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఓటింగ్‌లో త్రిగుణ్, ముఖేష్ గౌడ తొలి రెండు స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ ఫినాలే దశకు చేరుకుంటున్న వేళ.. 12వ వారం మేకర్స్ డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చారు. తక్కువ ఓటింగ్ కారణంగా టెంపర్ వంశీ ఎలిమినేట్ అయినట్లు వార్తలు రాగా, డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా వర్షిణి సౌందరరాజన్ కూడా హౌస్ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ఈ వారం మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు: త్రిగుణ్, ముఖేష్ గౌడ, ఆటో రామ్‌ప్రసాద్, దెబ్జానీ, రామకృష్ణ, టెంపర్ వంశీ, వర్షిణి సౌందరరాజన్ నామినేషన్లలో ఉన్నారు. పబ్లిక్ ఓటింగ్‌లో త్రిగుణ్ మరియు ముఖేష్ గౌడ తొలి రెండు స్థానాల్లో నిలిచి బలంగా దూసుకుపోతున్నారు. రామ్‌ప్రసాద్, రామకృష్ణ, దెబ్జానీ మధ్యస్థ ఓట్లతో సురక్షిత జోన్‌లోకి చేరుకున్నట్లు తెలుస్తోంది.
చివరికి టెంపర్ వంశీ మరియు వర్షిణి డేంజర్ జోన్‌లో ఉండగా, అందులో నుంచి వంశీని శనివారం ఎపిసోడ్లో ఎలిమినేటి చేసారు. వీరిద్దరూ గతంలోనూ పలుమార్లు డేంజర్ జోన్‌ను ఎదుర్కొన్నారు. రెండో వారంలోనూ ఎలిమినేషన్ ముప్పు ఎదురైనప్పుడు ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేసి వీరిని కాపాడిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం ఎపిసోడ్ లో వర్షిణి ఎలిమినేటి అవుతుంది అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
త్రిగుణ్ కి అత్యంత సన్నిహితుడిగా ఇన్ని వారాలు హౌజ్ లో చెలామణి అయిన వంశీ ఎలిమినేషన్ త్రిగుణ్ ని తప్పకుండ నిరుత్సాహపరుస్తుంది. అంతే కాకుండా, వర్షిణి లేని లోటు ముకేశ్ ఆట తీరులో కూడా ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగానే ఉంది.
ఈ సీజన్‌లో త్రిగుణ్ విజేతగా నిలిచే దిశగా బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖేష్ గౌడ అతనికి ప్రధాన పోటీదారుగా నిలబడతాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.