• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  Bigg Boss Telugu 10:...

Bigg Boss Telugu 10: డెమన్ పవన్, రీతూ, శోభా శెట్టి & టేస్టీ తేజ ఎంట్రీ!

| బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు డెమన్ పవన్, రీతూ, శోభా శెట్టి, టేస్టీ తేజ ఎంట్రీ ఇచ్చారు. టాస్కుల్లో డెబ్జానీ కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచింది. మరో గేమ్‌లో వర్షిణి నరేష్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని అమన్, శోభా ఆరోపించారు. చివరకు అమన్-శోభా జంట విజయం సాధించింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-26 03:50 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పన్నెండో వారంలో నడుస్తున్న 'బడ్డీ అప్' థీమ్ హౌస్‌లో సరికొత్త ఉత్సాహాన్ని, వినోదాన్ని నింపుతోంది. ఇప్పటికే ఇమ్ము, సంజన, కళ్యాణ్ పడాల, దివ్య వంటి మాజీ కంటెస్టెంట్లు హౌస్‌లోకి వచ్చి సందడి చేయగా.. తాజాగా డెమన్ పవన్, రీతూ, శోభా శెట్టి మరియు టేస్టీ తేజ గెస్ట్‌లుగా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లతో కలిసి టాస్క్‌లు ఆడారు.

హౌస్‌లోకి డెమన్ పవన్, రీతూ ఒకరి తర్వాత ఒకరుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే గతంలో ఒకే సీజన్‌లో ఉన్నప్పటికీ, వీరిద్దరి మధ్య ఏదో తెలియని గ్యాప్ ఉన్నట్లు, పెద్దగా మాట్లాడుకోకపోవడం గమనార్హం. అనంతరం జరిగిన గేమ్‌లో ముఖేష్ - రీతూ ఒక జట్టుగా, దెబ్జానీ - డెమన్ పవన్ మరో జట్టుగా పోటీపడ్డారు. ఈ టాస్క్‌కు త్రిగుణ్ సంచాలకుడిగా వ్యవహరించాడు.

హోరాహోరీగా సాగిన ఈ గేమ్‌లో పవన్ టీ-షర్ట్ కూడా చిరిగిపోయింది. చివరకు సంచాలకుడు త్రిగుణ్ దెబ్జానీ - డెమన్ పవన్ జంట గెలిచినట్లు ప్రకటించడంతో, దెబ్జానీ కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ ఆనందంలో దెబ్జానీ తాను దాచిపెట్టుకున్న ఒక టీ-షర్ట్‌ను పవన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చింది.

ఆ తర్వాత హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి, టేస్టీ తేజ కంటెస్టెంట్లకు ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. హౌస్‌లో తమ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పి వారికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టాలి, అలాగే ఎవరితో స్నేహం కొనసాగించకూడదని భావిస్తారో వారి చేతికి ఉన్న బ్యాండ్‌ను కత్తిరించాలి.

అనంతరం జరిగిన టాస్క్‌లో శోభా శెట్టి - అమన్ ఒక జట్టుగా, టేస్టీ తేజ - నరేష్ మరో జట్టుగా తలపడ్డారు. ఈ గేమ్‌కు వర్షిణి సంచాలకురాలిగా వ్యవహరించింది.

అయితే గేమ్ జరుగుతున్నంతసేపు వర్షిణి పదేపదే బాల్‌ను నరేష్ వైపే వేస్తూ అతనికి అనుకూలంగా ఆడిస్తోందని అమన్, శోభా తీవ్రంగా ఆరోపించారు. సంచాలకురాలిగా వర్షిణి అన్‌ఫెయిర్‌గా వ్యవహరిస్తోందని ఇద్దరూ వాదించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు అమన్ - శోభా జంట ఈ టాస్క్‌లో విజయం సాధించింది.

మరోవైపు చివరి వరకు వచ్చి ఓడిపోవడంతో నరేష్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మొత్తానికి మాజీ కంటెస్టెంట్ల రాకతో హౌస్‌లో అటు టాస్క్‌ల వేడి, ఇటు స్నేహబంధాల మధ్య చీలికలు స్పష్టంగా బయటపడ్డాయి!

Tags:    
  • biggboss 
  • biggboss10 
  • biggbosstelugu10 
  • demonpavan 
  • shobhashetty 
  • tastyteja 

Similar News

దేశం ముందు.. కళ తర్వాత.. పాక్ ఆర్టిస్టుల కంటెంట్‌పై హాట్ టాపిక్

2026-11-25 10:30 GMT

నెట్‌ఫ్లిక్స్‌లో మెగాస్టార్ కొత్త అడ్డా.. 'మెగావర్స్' ప్రోమోతో అసలు విషయం చెప్పేసిన చిరంజీవి!

2026-11-24 08:29 GMT

నీతూ మాస్టర్ ఎలిమినేషన్‌పై భర్త ఫైర్.. పూరీ, అలీకి నటరాజ్ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్!

2026-11-24 06:32 GMT

ఓటీటీలోకి నేరుగా తెలుగు వెర్షన్.. మహిళల ఆదరణ దక్కేనా?

2026-11-24 05:43 GMT

భారీ అంచనాలతో వచ్చి.. నెలలోనే ఓటీటీ బాట!

2026-11-22 11:35 GMT

Bigg Boss Telugu 10: వంశీ మాటలపై తల దించుకుంటున్నానని చెప్పిన నాగార్జున

2026-11-22 10:39 GMT

Bigg Boss Telugu 10: నీతూ నటరాజ్ అవుట్? డబుల్ ఎలిమినేషన్‌పై ఉత్కంఠ!

2026-11-22 10:38 GMT

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

మెగాస్టార్ 'మెగావర్స్'లో తమిళ్ మెగా బ్రదర్..!

2026-11-17 05:38 GMT

Copyright @2026

Powered by Blink CMS