ఇక పెద్ద స్క్రీన్‌పై రీల్స్ చూసే అవకాశం!
| మెటా ‘ఇన్స్టాగ్రామ్ ఫర్ టీవీ’ యాప్‌ను తీసుకొస్తోంది. దీంతో ఆపిల్ టీవీ, ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి పరికరాల్లో రిమోట్‌తోనే రీల్స్ చూసుకోవచ్చు. ఒకే యాప్‌లో ఐదు అకౌంట్ల వరకు జోడించుకునే అవకాశం, ఫోన్ నుంచి టీవీకి రీల్స్ క్యాస్ట్ చేసే సదుపాయం కూడా ఉన్నాయి. టీనేజర్ల కోసం ప్రత్యేక భద్రతా నియమాలను అమలు చేయనున్నారు.
ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటే చేతిలో ఫోన్ పట్టుకుని, తల దించుకుని గంటల తరబడి స్క్రోల్ చేయడమే అలవాటు. కానీ ఆ అలవాటుకు మెటా ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్ వేయబోతోంది. నేరుగా ఇంట్లోని స్మార్ట్ టీవీలోనే రీల్స్ చూసేలా ‘ఇన్స్టాగ్రామ్ ఫర్ టీవీ’ యాప్‌ను తీసుకొస్తోంది. చిన్న స్క్రీన్ నుంచి ఏకంగా లివింగ్ రూమ్ టీవీలోకి రీల్స్ రావడంతో, మన ఎంటర్టైన్మెంట్ తీరు ఎలా మారబోతోందో ఇప్పుడు చూద్దాం..
రిమోట్‌తోనే రీల్స్.. వేలికి రెస్ట్:
మొబైల్లో రీల్స్ చూస్తుంటే బొటనవేలు నొప్పి పుడుతుంది కానీ స్క్రోలింగ్ ఆగదు. కానీ టీవీ యాప్‌లో ఆ కష్టం ఉండదు. ఆపిల్ టీవీ, ఫైర్ టీవీ, గూగుల్ టీవీ లాంటి వాటిలో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఇక టీవీ రిమోట్‌తోనే కామెడీ, వంటలు, ట్రావెల్, సినిమా వీడియోలను ఈజీగా మార్చుకోవచ్చు. పైగా వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి కాబట్టి, రిలాక్స్‌గా సోఫాలో కూర్చుని పెద్ద తెరపై ఎంజాయ్ చేయొచ్చు.
ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా?:
ఫోన్ అంటే ఎవరికి వాళ్లు పర్సనల్‌గా చూసుకుంటారు. కానీ టీవీ అందరిదీ కాబట్టి, ఒకే యాప్‌లో ఐదు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల వరకు యాడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. ఇక ఎవరి ఇంట్రెస్ట్‌కు తగ్గ ఫీడ్ వాళ్లకు వస్తుంది. అలాగే ఫోన్లో నచ్చిన రీల్ కనిపిస్తే, ఒకే వైఫైలో ఉన్నప్పుడు క్యాస్టింగ్ ఆప్షన్‌తో నేరుగా టీవీ స్క్రీన్ మీదకు పంపే వీలు కూడా ఉంది.
క్రియేటర్లకు, వ్యూయర్లకు కొత్త ఫీలింగ్:
ఫోన్లో నిలువుగా కనిపించే రీల్స్‌ను పెద్ద టీవీ స్క్రీన్‌పై చూస్తుంటే క్వాలిటీ, విజువల్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరం. ఫన్నీ రీల్స్, డ్యాన్స్‌లు, ఫుడ్ వీడియోలను ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి నవ్వుకుంటూ చూడటానికి ఇది బాగా సెట్ అవుతుంది. ఇక క్రియేటర్ల కంటెంట్ కూడా ఇంకా ఎక్కువ మందికి, కొత్త స్టైల్లో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
మీ టీవీకి సపోర్ట్ చేస్తుందా? చెక్ చేసుకోండి:
ఈ కొత్త యాప్ భారత్‌లో కూడా రాబోతున్నా, ప్రతి స్మార్ట్ టీవీలోనూ వెంటనే వస్తుందని చెప్పలేం. మీ టీవీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తోంది, యాప్ సపోర్ట్ ఉందా లేదా అనేది ముందే చూసుకోవాలి. అన్ని టీవీలకు అందుబాటులోకి వస్తే, ఇంట్లో ఎంటర్టైన్మెంట్లో ఇదో పెద్ద మార్పు అవుతుంది.
పిల్లల సేఫ్టీ సంగతేంటి?:
ఇంట్లో టీవీలో ప్లే అవుతుందంటే పిల్లలు కూడా కచ్చితంగా చూస్తారు. అందుకే టీనేజర్ల అకౌంట్లకు ఉండే సేఫ్టీ రూల్స్‌ను ఈ టీవీ యాప్‌లోనూ గట్టిగా పెడుతున్నారు. ఇక వయసుకు తగ్గ కంటెంట్ మాత్రమే కనిపించేలా లిమిట్స్ ఉంటాయి. మొత్తానికి యూట్యూబ్ షార్ట్స్‌కు గట్టి పోటీ ఇస్తూ, రీల్స్‌ను మన డ్రాయింగ్ రూమ్‌లోకి తీసుకొచ్చింది మెటా..