• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విలక్ష‌ణ న‌టుడి...

విలక్ష‌ణ న‌టుడి వార‌సురాలి ప్ర‌యోగాలు ఫ‌లిస్తున్నాయ్

| ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో ప్రత్యేక పాత్రతో శ్రుతి హాసన్ ప్రశంసలు అందుకుంటున్నారు. కథలో కీలక మలుపు తీసుకొచ్చే ఈ పాత్రకు నిర్మాత స్వప్నాదత్ ఆమెను ఎంపిక చేయగా, సహజమైన నటనతో ఆకట్టుకున్నారని టాక్. దీంతో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న విభిన్న పాత్రల్లోనూ కనిపించేందుకు శ్రుతి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్‌కు కొత్త మలుపు కానుందనే చర్చ నడుస్తోంది.

By - Sivaji Kontham
Update: 2026-11-29 02:30 GMT

విలక్షణ నటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభం కేవ‌లం గ్లామ‌ర‌స్ డాళ్ గానే క‌నిపించింది. అయితే ఇటీవ‌ల శ్రుతి వ‌రుస కూడా మారింది. ఇప్పుడు న‌టిగా తనలోని వైవిధ్యాన్ని వెండితెరపై మరింత బలంగా ఆవిష్కరిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. ఒకప్పుడు `గబ్బర్‌సింగ్` చిత్రంలో భాగ్యలక్ష్మి పాత్ర దానంతట అదే త‌న చెంత‌కు వచ్చి కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కమర్షియల్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి.. తాజాగా `ఆకాశంలో ఒక తార` చిత్రంలో పోషించిన ప్రత్యేక పాత్రతో తన నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు.

ఈ పాత్రకు శ్రుతి అయితేనే పూర్తి న్యాయం చేయగలరని భావించి నిర్మాత స్వప్నాదత్ త‌న‌కు ఈ అవకాశం కల్పించారు. కథను కీలక మలుపు తిప్పే ఈ పాత్ర పరిధి ప్రత్యేకమైనదే అయినా శ్రుతి తన సహజమైన అభినయంతో ఆ పాత్రకు ప్రాణం పోశారనే ప్రశంసలు కురుస్తున్నాయి. తనవైపు వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న శ్రుతి కేవలం గ్లామర్ డాళ్‌ ఇమేజ్‌కే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న పాత్రల్లో ఎంతలా ఒదిగిపోగలరో ఈ సినిమాతో స్పష్టంగా చాటారు.

ఈ చిత్రం తెచ్చిపెట్టిన గుర్తింపు ఇప్పుడు శ్రుతి హాసన్ కెరీర్‌నే కొత్త మలుపు తిప్పుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా, నటనకు ప్రాధాన్యత ఉన్న చిన్న లేదా ప్రత్యేక పాత్రల్లోనైనా నటించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారనే నమ్మకంతో పలువురు దర్శక నిర్మాతలు ఇప్పుడు విలక్షణమైన పాత్రలతో సంప్రదిస్తున్నారు. తన ఛరిష్మాను మరింత విస్తరించుకునే ఆలోచనతో శ్రుతి కూడా ఆచితూచి అడుగులు వేస్తూ.. కథాబలమున్న మంచి స్క్రిప్ట్‌లను అస్సలు వదిలిపెట్టడం లేదని తెలుస్తోంది.

నిజానికి కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుడి వారసురాలిగా ఆ స్థాయి అంచనాలను అందుకోవడం అంత సులభం కాదు. అయితే బలమైన- వైవిధ్యభరితమైన పాత్రలు రాసే దర్శక రచయితలు శ్రుతిని దృష్టిలో ఉంచుకుని కథలు సిద్ధం చేస్తే వెండితెరపై అద్భుతాలు చేయగల సత్తా త‌న‌లో ఉంది. `ఆకాశంలో ఒక తార` ఇచ్చిన ఈ ఉత్సాహంతో క‌మ‌ల్ న‌ట‌వారసురాలిగా తన పేరును ది బెస్ట్ గా నిలబెట్టుకునే సువర్ణావకాశం ఇప్పుడు శ్రుతిహాసన్ కి ద‌క్కింది.

Tags:    
  • shrutihaasan 
  • aakasamlookatara 
  • kamalhaasan 
  • swapnadutt 

Similar News

ఇంతకీ 'విశ్వంభర' పస్ట్‌ కాపీ రెడీనా?

2026-11-29 01:30 GMT

శర్వానంద్‌ ఇక సంక్రాంతి కాపాడాలి..!

2026-11-29 00:30 GMT

'అసరీరి' హిట్‌ అయితే నానితో 96 కన్ఫర్మ్..!

2026-11-28 22:30 GMT

రవితేజ, మెగా హీరో ప్లేస్‌లో బాలకృష్ణ రానున్నాడా?

2026-11-28 19:30 GMT

మంచి దారిలో విశ్వక్‌ సేన్‌, కిరణ్ అబ్బవరం..!

2026-11-28 18:30 GMT

నాగ చైతన్య ఫుడ్ వార్నింగ్

2026-11-28 17:30 GMT

'రాకా' కంటే ముందు AA23... సాధ్యమేనా?

2026-11-28 17:30 GMT

బాస్ లేడీ కృతి మిష‌న్ ఏంటో కానీ..! తిన‌డంలో ది బెస్ట్!

2026-11-28 16:57 GMT

'నీరో' ఫస్ట్ స్పార్క్.. తగలబడుతున్న సామ్రాజ్యంలో ప్రేమ రాత!

2026-11-28 16:54 GMT

15 ఏళ్లుగా డాడీ కూల్.. కింగ్‌తో బెబో డ్యాన్స్ ఫ్లోర్‌పై చిల్లింగ్

2026-11-28 16:51 GMT

నానితో ఈ కాంబినేషన్ బాగుంది కానీ..

2026-11-28 16:50 GMT

Copyright @2026

Powered by Blink CMS