• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'నీరో' ఫస్ట్ స్పార్క్.....

'నీరో' ఫస్ట్ స్పార్క్.. కాలిపోతున్న గదిలో ప్రేమ రాత

| కొత్త చిత్రం ‘నీరో’ ఫస్ట్ స్పార్క్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది. ఇల్లంతా మంటల్లో కాలిపోతున్నా, ఉయ్యాలపై ఉన్న అమ్మాయి గుండెపై హీరో ప్రేమ కావ్యం రాసే సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో అరవింద్ హీరోగా నటిస్తున్నారు. అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్నారు.

By - M Prashanth
Update: 2026-11-28 16:54 GMT

కొత్త వాళ్ల సినిమా అనగానే అందరూ సేఫ్ కమర్షియల్ ఫార్ములానే నమ్ముకుంటారు. స్టార్ హీరోల సినిమాలకు ఉండే హడావుడి లేకపోయినా, ఒక్క షాట్ తోనే ఆడియన్స్ అటెన్షన్ లాగడం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. 'నీరో' టీమ్ వదిలిన ఫస్ట్ స్పార్క్ గ్లింప్స్ కూడా సరిగ్గా ఇదే ప్లాన్ తో వచ్చింది. ఇల్లంతా మంటల్లో కాలిపోతుంటే, లోపల ఉయ్యాలపై వాలిపోయిన అమ్మాయి గుండెపై హీరో ప్రేమ కావ్యం రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




గ్లింప్స్ లో కనిపించిన ప్రతి ఫ్రేమ్ రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంది. చుట్టూ మంటలు, కాలిపోతున్న మెట్లు, ఉయ్యాల, చేతిలో పెన్ను లాంటి ఎలిమెంట్స్ తో ఒక రా అండ్ ఇంటెన్స్ మూడ్ సెట్ చేశారు. హీరో అరవింద్ ఏమాత్రం కంగారు లేకుండా నడుచుకుంటూ వచ్చి, 'ప్రేమంటే షాజహాన్ కట్టిన తాజ్ మహల్ కాదు, తాజ్ మహల్ కట్టిన షాజహాన్' అని రాయడం కథలోని డెప్త్ ను చూపిస్తోంది.

ఉయ్యాలపై వాలిపోయిన అమ్మాయి లుక్, నెమలి పింఛం లాంటి డీటెయిల్స్ తో పాటు "లెట్ ది వరల్డ్ బర్న్" అనే ట్యాగ్ లైన్ ఆసక్తి పెంచుతున్నాయి. పాటల రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని ఈ సినిమాతో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. చాలా వరకు రైటర్లు మెగాఫోన్ పడితే మాటల ప్రవాహం ఎక్కువగా ఉండే కథలను ఎంచుకుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం తనలోని కవిత్వాన్ని కేవలం డైలాగ్స్ కే పరిమితం చేయకుండా, ఒక బోల్డ్ విజువల్ లాంగ్వేజ్ లో చెప్పే ప్రయత్నం చేశారు.

మొదటి సినిమాకే ఇలాంటి ప్రయోగాత్మక కథను ఎంచుకోవడం హైలెట్. హీరో అరవింద్, దర్శకుడు కళ్యాణ్ ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ప్రొడక్షన్ బ్యాకింగ్ ఆసక్తి రేపుతోంది. విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమాతో అసోసియేట్ అయిన యువ నిర్మాత అనురాగ్ పర్వతనేని, గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త వాళ్లతో రొటీన్ ఎంటర్ టైనర్ తీయకుండా, కంటెంట్ మీద నమ్మకంతో ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్ పై పెట్టుబడి పెట్టడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇలాంటి హెవీ ఎమోషన్, ఇంటెన్స్ సెటప్ తెరపై తేలిపోకుండా ఉండాలంటే టెక్నికల్ సపోర్ట్ చాలా ముఖ్యం. సీనియర్ సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ విజువల్స్, ఓషో వెంకట్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ఫస్ట్ స్పార్క్ కు మంచి ఎలివేషన్ ఇచ్చాయి. కేవలం ఒక్క గ్లింప్స్ తో సినిమా జానర్ ఏంటో పూర్తిగా రివీల్ చేయకుండా, ప్రేక్షకుల్లో ప్రశ్నలు మిగల్చడంలో 'నీరో' టీమ్ సక్సెస్ అయింది. అయితే ఈ ఇనిషియల్ బజ్ ను నిలబెట్టుకోవాలంటే కంటెంట్ కూడా అంతే బలంగా ఉండాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, మ్యూజికల్ అప్డేట్స్ తో పాటు రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఇక ఆ అప్డేట్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.


Full View


Tags:    
  • niroglimpse 
  • nirofirstspark 
  • aravind 
  • kalyanchakravarthy 
  • goldmountaincreations 

Similar News

15 ఏళ్లుగా డాడీ కూల్.. కింగ్‌తో బెబో డ్యాన్స్ ఫ్లోర్‌పై చిల్లింగ్

2026-11-28 16:51 GMT

నానితో ఈ కాంబినేషన్ బాగుంది కానీ..

2026-11-28 16:50 GMT

నైజాం కోటను లాక్ చేసిన 'కాకా'!

2026-11-28 16:34 GMT

ప్లాస్టిక్ కంటే ప్రమాదకరమైన మరో సమస్య.. సముద్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు!

2026-11-28 16:33 GMT

ఇడుపు కాయితం.. ఆంధ్రాలో ఇంకా ఎక్కలేదట..

2026-11-28 16:33 GMT

కమర్షియల్ సినిమా.. చైతూ చెప్పిన నిజం

2026-11-28 16:32 GMT

మాల్దీవుల అందాల మధ్య మెరిసిపోయిన సోనాల్ చౌహాన్!

2026-11-28 16:30 GMT

ఆ ఇరువురి న‌డుమా న‌లిగిపోతున్న డార్లింగ్!

2026-11-28 14:30 GMT

బెంగ‌ళూరు మురికివాడ‌ల‌పై ఆస్కార్ బ‌రిలో తెలుగు-క‌న్న‌డ చిత్రం!

2026-11-28 13:30 GMT

'ఈతా' కోసం 12 కిలోల బరువు పెరిగిన శ్ర‌ద్ధా.. 8కేజీల గ‌జ్జెలు.. గాయాల‌తోనే!

2026-11-28 12:30 GMT

ఈ దర్శకులు ఇంకా అవే కథలను పట్టుకుంటున్నారా?

2026-11-28 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS