• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇడుపు కాయితం.. ఆంధ్రాలో...

ఇడుపు కాయితం.. ఆంధ్రాలో ఇంకా ఎక్కలేదట..

| 'ఇడుపు కాయితం' సినిమాపై తెలంగాణలో అవేర్‌నెస్ బాగానే ఉందని, ఆంధ్రాలో మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో లేదని నిర్మాత బన్నీ వాస్ తెలిపారు. టైటిల్ స్థానిక పదం కావడంతో అక్కడి ప్రేక్షకులకు చేరడానికి సమయం పడుతోందన్నారు. ప్రియదర్శి, అభినవ్ గోమఠం కామెడీ ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ సినిమా డిసెంబర్ 11న విడుదల కానుంది.

By - M Prashanth
Update: 2026-11-28 16:33 GMT

టాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ కు ముందు నిర్మాతలు అంతా బాగుందని, అన్ని ఏరియాల్లో ఫుల్ క్రేజ్ ఉందని చెప్పుకోవడం నార్మల్ గా జరిగేదే. కానీ నిర్మాత బన్నీ వాస్ మాత్రం 'ఇడుపు కాయితం' విషయంలో ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టారు. లేటెస్ట్ గా జరిగిన 'ఉల్లిపూల' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, తెలంగాణలో తమ సినిమాపై అవేర్ నెస్ బాగానే ఉందని, కానీ ఆంధ్రాలో మాత్రం ఇంకా ఆ స్థాయిలో జనాలకు ఎక్కలేదని బన్నీ వాస్ ఓపెన్ గా ఒప్పుకున్నారు.

నిజానికి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం సినిమా టైటిలే. 'ఇడుపు కాయితం' అనేది పూర్తిగా తెలంగాణ పల్లెటూళ్లలో వాడే లోకల్ పదం. టైటిల్ అనౌన్స్ చేసిన కొత్తలో రూరల్ ఏరియా వాళ్లకు తప్ప, మిగతా తెలంగాణ జనాలకు కూడా దీని అర్థం వెంటనే తట్టలేదు. ఇక ఆంధ్రా సైడ్ అయితే అసలు పెద్దగా వినిపించని పదం కావడంతో, అక్కడి ఆడియన్స్ కు ఇదేం సినిమానో అర్థం కావడానికి కాస్త టైమ్ పట్టింది.

అయితే సినిమా నుంచి మెల్లగా అప్డేట్లు బయటకు రావడం మొదలయ్యాక ఆడియన్స్ లో ఒక క్లారిటీ వస్తోంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్ తో పాటు రీసెంట్ గా వచ్చిన పాటలు చూశాక ఇదొక రూరల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని ప్రేక్షకులకు అర్థమవుతోంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ట్యూన్స్, కొత్త సింగర్ హెనాగ్రేస్ పాడిన 'ఉల్లిపూల' ఫోక్ సాంగ్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

టైటిల్ చూసి ఇదేదో సీరియస్ ఎమోషనల్ డ్రామా అనుకుంటున్న వాళ్లకు థియేటర్లలో గట్టి సర్ ప్రైజ్ ఉంటుందని బన్నీ వాస్ హింట్ ఇచ్చారు. సినిమాలో ప్రియదర్శి, అభినవ్ గోమఠం కలిసి చేసే రెండు మూడు కామెడీ ఎపిసోడ్లు ఆడియన్స్ ను సీట్లలో కూర్చోనివ్వకుండా నవ్విస్తాయని చెప్పారు. అలాగే ప్రియదర్శి లాంటి అనుభవం ఉన్న నటుడి పక్కన కొత్త హీరోయిన్ నాగదుర్గ గుత్తా ఏమాత్రం తగ్గకుండా పోటీ పడి నటించారని అన్నారు.

ప్రీ రిలీజ్ బజ్ తక్కువగా ఉన్నా బన్నీ వాస్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి బలమైన రీజన్ ఉంది. తెలంగాణ కథైనా, ఆంధ్రా కథైనా, అండమాన్ కథైనా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. గతంలో 'బలగం', 'డీజే టిల్లు' లాంటి సినిమాలు కూడా ముందు తెలంగాణలో మొదలై, ఆ తర్వాత మౌత్ టాక్ తో ఆంధ్రాలో భారీ కలెక్షన్లు రాబట్టాయి. పైగా బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ లాంటి పెద్ద బ్యానర్లు తోడుండటంతో థియేటర్ల పరంగా ఇబ్బంది ఉండదు.

వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో 2 గంటల 41 నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న ఈ సినిమాను చూశాకే బన్నీ వాస్ ఇంత ధీమాగా మాట్లాడుతున్నారట. డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న 'ఇడుపు కాయితం'కు ఆంధ్రా మార్కెట్ లో మొదటి రోజు టాక్ కీలకం కానుంది. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే చాలు, కోస్తా, సీడెడ్ ఏరియాల్లోనూ ఈ సినిమా కలెక్షన్లు పికప్ అవ్వడం ఖాయం.

Tags:    
  • idupukayitham 
  • bunnyvas 
  • priyadarshi 
  • abhinavgomatam 
  • nagadurgagutta 

Similar News

నైజాం కోటను లాక్ చేసిన 'కాకా'!

2026-11-28 16:34 GMT

ప్లాస్టిక్ కంటే ప్రమాదకరమైన మరో సమస్య.. సముద్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు!

2026-11-28 16:33 GMT

కమర్షియల్ సినిమా.. చైతూ చెప్పిన నిజం

2026-11-28 16:32 GMT

మాల్దీవుల అందాల మధ్య మెరిసిపోయిన సోనాల్ చౌహాన్!

2026-11-28 16:30 GMT

ఆ ఇరువురి న‌డుమా న‌లిగిపోతున్న డార్లింగ్!

2026-11-28 14:30 GMT

బెంగ‌ళూరు మురికివాడ‌ల‌పై ఆస్కార్ బ‌రిలో తెలుగు-క‌న్న‌డ చిత్రం!

2026-11-28 13:30 GMT

'ఈతా' కోసం 12 కిలోల బరువు పెరిగిన శ్ర‌ద్ధా.. 8కేజీల గ‌జ్జెలు.. గాయాల‌తోనే!

2026-11-28 12:30 GMT

ఈ దర్శకులు ఇంకా అవే కథలను పట్టుకుంటున్నారా?

2026-11-28 11:30 GMT

చిరంజీవి అలాంటి కథ కోసం చూస్తున్నాడా?

2026-11-28 10:30 GMT

నాగ చైతన్య.. ఆ రిస్క్ వెనుక తండ్రి పోలికే!

2026-11-28 09:30 GMT

రామ్ చరణ్ కి కథ చెప్పి ఒప్పించాలంటే ఈ ఎలిమెంట్స్ ఉండాల్సిందే...

2026-11-28 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS