• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శర్వానంద్‌ ఇక సంక్రాంతి...

శర్వానంద్‌ ఇక సంక్రాంతి కాపాడాలి..!

| శర్వానంద్ నటించిన ‘భోగి’కి తొలిరోజు వసూళ్లు నిరాశాజనకంగా ఉండటంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2027 సంక్రాంతికి విడుదల కానున్న ‘జార్జ్ క్రిష్‌’పై ఆశలు పెట్టుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీ మోహన్, భాను భోగవరపు, నందు సవిరిగాన స్క్రిప్ట్‌కు పనిచేశారు. మానస వారణాసి, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికావడంతో సంక్రాంతి బరిలో సినిమా రావడం ఖాయంగా కనిపిస్తోంది.

By - Ramesh Palla
Update: 2026-11-29 00:30 GMT

శర్వానంద్ ఈ ఏడాది 'నారి నారి నడుమ మురారి', 'బైకర్‌' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. అయినా కూడా శర్వానంద్‌ సినిమా అనగానే కొందరు ప్రేక్షకులు తప్పకుండా మ్యాటర్‌ ఉందని నమ్మి 'భోగి' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందిన భోగి సినిమా తాజాగా విడుదల అయింది. సినిమాకు మొదటి రోజు వసూళ్లు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. రివ్యూలు సైతం నెగిటివ్‌గా వస్తున్నాయి. దాంతో శర్వానంద్‌ కి మరోసారి నిరాశే మిగలనుందా అనే టాక్‌ మొదలైంది. శర్వానంద్ అభిమానులు ఇప్పటికే భోగి సినిమా విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు సంపత్‌ నంది ఈ సినిమాను తీసిన విధానంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

శర్వానంద్‌ భోగి కలెక్షన్స్‌...

భోగి సినిమా ఫలితం పక్కన పెడితే ఇప్పుడు అందరి దృష్టి 2027 సంక్రాంతికి రాబోతున్న 'జార్జ్‌ క్రిష్‌' పై ఉంది. ఈ సినిమా టైటిల్‌ చాలా విభిన్నంగా, విచిత్రంగా ఉంది. శర్వానంద్‌ ఈ సినిమాతో కమర్షియల్‌ హిట్‌ కొట్టే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు వరుసగా బ్లాక్‌ బస్టర్‌ హిట్స్ కొట్టిన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇదే దర్శకుడు గత కొన్ని సంవత్సరాల్లో ఒక్క హిట్‌ కూడా ఇవ్వలేదు. అయినా కూడా ఆయన తన హిట్‌ చిత్రాల రచయిత గోపీ మోహన్‌తో కలిసి వర్క్‌ చేశాడు. గోపీ మోహన్‌తో కలిసి శ్రీను వైట్ల చేసిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇద్దరు విడిపోయిన తర్వాత శ్రీనువైట్లకు ఫ్లాప్‌లు పడ్డాయి అనేది టాలీవుడ్‌లో వినిపించే టాక్‌. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు జార్జ్‌ క్రిష్‌ తో శ్రీను వైట్ల కచ్చితంగా హిట్‌ కొట్టగలను అనే నమ్మకంతో కనిపిస్తున్నాడు.

శ్రీనువైట్ల దర్శకత్వంలో జార్జ్‌ క్రిష్‌...

శ్రీనువైట్లకు ఈ సినిమా స్క్రిప్ట్‌ విషయంలో కేవలం గోపీ మోహన్‌ మాత్రమే కాకుండా ఇంకా సామజవరగమన ఫేం భాను భోగవరపు, నందు సవిరిగాన లు సహకారం అందించినట్లు చెబుతున్నారు. సీనియర్స్ మరియు జూనియర్స్ కలిసి ఈ స్క్రిప్ట్‌ ను రెడీ చేసిన నేపథ్యంలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని అంతా నమ్ముతున్నారు. శర్వానంద్‌ బాడీ లాంగ్వేజ్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ బాగా సూట్ అవుతుంది. గతంలో ఆయన చేసిన కామెడీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక సంక్రాంతికి జార్జ్‌ క్రిష్ సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనడంలో సందేహం లేదని కొందరు విశ్లేషిస్తున్నారు. శర్వానంద్‌ గత కొన్ని ఏళ్లుగా సరైన కమర్షియల్‌ హిట్‌ లేక ఊగిసలాడుతున్నాడు. ఇలాంటి సమయంలో రాబోతున్న జార్జ్‌ క్రిష్ ఆయనకు అత్యంత కీలకంగా మారింది.

సంక్రాంతికి జార్జ్‌ క్రిష్‌ తో శర్వానంద్‌...

జార్జ్‌ క్రిష్ సినిమాలో శర్వానంద్‌కి జోడీగా మానస వారణాసి, ప్రీతి ముకుందన్‌లు నటించారు. విడుదలకు దాదాపు నెలన్నర సమయం ఉండగానే షూటింగ్‌ పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలు పెట్టినట్లుగా దర్శకుడు శ్రీను వైట్ల ప్రకటించాడు. ఆ మద్య శ్రీను వైట్ల డబ్బింగ్‌ పనులు మొదలు పెట్టినట్లుగా ప్రకటన చేయడంతో జార్జ్‌ క్రిష్ గురించి ప్రముఖంగా వార్తలు వచ్చాయి. సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో మొదటగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న సినిమాగా జార్జ్‌ క్రిష్ నిలిచింది అనడంలో సందేహం లేదు. అందుకే సంక్రాంతి బరి నుంచి తప్పకునే అవకాశాలు అస్సలే లేవని క్లారిటీ వచ్చింది. గతంలో శతమానం భవతి సినిమాతో సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టిన శర్వానంద్‌ మళ్లీ ఇన్నాళ్లకు జార్జ్‌ క్రిష్ సినిమాతో సంక్రాంతికి వచ్చి హిట్‌ కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.

Tags:    
  • sharwanand 
  • bhogimovie 
  • sreenuvaitla 
  • sankranthi2027 
  • georgekrish 

Similar News

'అసరీరి' హిట్‌ అయితే నానితో 96 కన్ఫర్మ్..!

2026-11-28 22:30 GMT

రవితేజ, మెగా హీరో ప్లేస్‌లో బాలకృష్ణ రానున్నాడా?

2026-11-28 19:30 GMT

మంచి దారిలో విశ్వక్‌ సేన్‌, కిరణ్ అబ్బవరం..!

2026-11-28 18:30 GMT

నాగ చైతన్య ఫుడ్ వార్నింగ్

2026-11-28 17:30 GMT

'రాకా' కంటే ముందు AA23... సాధ్యమేనా?

2026-11-28 17:30 GMT

బాస్ లేడీ కృతి మిష‌న్ ఏంటో కానీ..! తిన‌డంలో ది బెస్ట్!

2026-11-28 16:57 GMT

'నీరో' ఫస్ట్ స్పార్క్.. కాలిపోతున్న గదిలో ప్రేమ రాత

2026-11-28 16:54 GMT

15 ఏళ్లుగా డాడీ కూల్.. కింగ్‌తో బెబో డ్యాన్స్ ఫ్లోర్‌పై చిల్లింగ్

2026-11-28 16:51 GMT

నానితో ఈ కాంబినేషన్ బాగుంది కానీ..

2026-11-28 16:50 GMT

నైజాం కోటను లాక్ చేసిన 'కాకా'!

2026-11-28 16:34 GMT

ప్లాస్టిక్ కంటే ప్రమాదకరమైన మరో సమస్య.. సముద్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు!

2026-11-28 16:33 GMT

Copyright @2026

Powered by Blink CMS